ఈ 5 పనులు చేస్తోంది అంటే ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అని అర్ధం

ఇష్టమైన అమ్మాయి మనకు దొరికితే ఆ ఆనందమే వేరు… ప్రేమించే ప్రతి అబ్బాయికి కల ఇది. మనం ఎంతగానో కోరుకున్న అమ్మాయి ఒక్కసారి మనకోసం చూసే చూపు, మనకోసం పడే భాద చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు. ఇంకా చెప్పాలంటే మనం గెలిచిన ప్రతి సారి ఎంత ఆనందం ఉంటుందో, మనం గెలిచినప్పుడు మన ప్రియురాలి కళ్ళలో నవ్వును చూసినప్పటి ఆనందం, అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు ఎర్రబడే తన ముఖం వెయ్యి టన్నుల ఆనందాన్ని ఇస్తుంది. సపోస్ మనం ఒక అమ్మాయిని ప్రేమించాం కానీ ఆ అమ్మాయి నిజంగా ప్రేమిస్తుందా అంటే ఎలా తెలుస్తుంది. అది తెలియడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి… అవేంటో ఇప్పుడు చూద్దాం.

Image result for girl boy love
  • ప్రేమించిన అమ్మాయి నమ్మితే ఆ ఫీలింగే వేరు, కానీ నువ్వు ఎంచుకున్న గోల్స్ అన్నిటికి మద్దతు ఇచ్చేవారు దొరకరు. ఒక వేళ మీ కెరియర్ కు సంబందించిన కలతో, మీ గోల్స్ తో తనకు ఇబ్బందులు ఎదురవుతాయి అని వెళ్లిపోయే వారు ఎక్కువ మంది ఉంటారు. అలాకాకుండా ఇతనితోనే నా జీవితం అనుకునేవాళ్లు, నీ కలలను ఎలా నెరవేర్చాలి అని ఆలోచిస్తారు. కాబట్టి మీ కెరియర్ కి సపోర్ట్ ఇస్తారు.
  • నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే బాధపడతారు. కానీ బయటకు చెప్పరు. నువ్వు తనకు ఇచ్చిన ప్రేమ లేదా తనకు ఇచ్చిన ఆనందం వేరే వారు తీసుకుంటే ఆమెకు నచ్చదు. అలా అని నీ స్వేచ్చకు అడ్డు చెప్పారు. అందరితోనూ నిన్ను మాట్లాడనిస్తారు. కానీ తనతో మాట్లాడిన కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడతారు.
  • అమ్మాయిల ప్రేమ అబ్బాయిల కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిల విషయాలలో వాళ్ళ కన్నా అమ్మాయిలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. చివరికి తిండి తినేటప్పుడు ఎలా తింటున్నాడు అనే విషయంలో కూడా నిన్ను చూస్తూ ఉంటారు. నిన్ను పైకి తిట్టినా, నీ బట్టలు దాక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. నిన్ను రాజకుమారుడిలా చూడాలనుకుంటారు.
Image result for girl boy love
  • నీ ఫీలింగ్స్ అన్ని నీ ఎక్సప్రెషన్స్ అన్ని ఒక భాషల కనిపిస్తాయి తనకు. నిన్ను ఎంత టార్చర్ పెట్టినా నవ్వుతుంది కానీ లోపల చాలా భాద పడుతుంది. అందులోను నువ్వు ఏమాత్రం డల్ గా కనిపించినా తాను తట్టుకోలేదు. ఇంకా ఎక్కువగా ప్రేమిస్తే, నిన్ను చూసి నీకేం కావాలో గెస్ చేసి వెంటనే చెప్తుంది.
  • నీ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నీలోని చాలా విషయాలను చెప్పి చెప్పి చంపుతుంది. అలాగే నువ్వు ఉన్నపుడు మాత్రం కొంచం తగ్గించి వెక్కిరిస్తుంది. అదే నీ గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం కళ్ళతో వింటుంది. కళ్ళతో ఎలా వింటుంది అంటారా.. అప్పుడు ఆమె ముఖంలో ఎక్సప్రెషన్స్ తెలుస్తుంది. ఎవరైనా నిన్ను పొగిడితే తాను మురిసిపోతుంది.

ఇలా కొన్ని ట్రిక్స్ ద్వారా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవచ్చు. మరి మీరు ప్రేమించే అమ్మాయి ఇలాగే ఉంటుందా..అయితే మీ అంత లక్కీ ఎవరు ఉండరు. ఎట్టి పరిస్థితితో ఆ అమ్మాయిని మిస్ చేసుకోకండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation