ఉగాది రోజున అసలు చేయకూడని పనులు… ఇలా చేస్తే మీ పని అంతే?

188

ఉగాది పండుగ తెలుగు వారికి మొదటి పండుగ.దీనికే యుగాది అని కూడా పేరు. యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము.యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది. మరోలా చెప్పాలంటే ఉగాది అనగా ఉ అంటే నక్షత్రము అని, గా అనగా గమనం, అంటే నక్షత్ర గమనము. ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు, ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ 2020 మార్చి 25 నుంచి మొదలయ్యే తెలుగు సంవత్సరాన్ని శ్రీ శార్వరి నామ సంవత్సరం అని అంటారు. అయితే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు తప్పక చెయ్యాల్సిన, చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

voice..

షడ్రుచులతో కలగలిపిన ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది రోజున ఉద‌యం తలకి స్నానం చేసిన త‌రువాత కొత్త వ‌స్ర్తాల‌ను ధ‌రిస్తారు. నూత‌న వ‌స్ర్త ధారణ అనే మాట‌లో ఒక ప్ర‌త్యేకమైన‌ విష‌య‌ముంటుంది. ఉగాది నాడు అంచు కలిగిన‌టువంటి బ‌ట్ట క‌ట్టుకోవాలి. అంచుక‌లిగిన బ‌ట్ట, ఖండ‌ము కాన‌టువంటి బ‌ట్ట ఏదైతే ఉంటుందో అటువంటి బ‌ట్ట యందు స‌మ‌స్త దేవ‌త‌లంద‌రూ కూడా ఆవ‌హించి ఉంటార‌న్న‌ది వేద‌వాక్కు. వేద‌వాక్కే ప్ర‌మాణ వాక్కు. ఏదైనా ఒక ప‌ని చేయాలి అంటే శాస్ర్తాన్ని ప్ర‌మాణం చేసుకుని చేయాలి. అలాగే కొత్త వస్ర్తాలతో దేవునికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు, చిత్రాన్నం సమర్పించాలి. వేసవి తాపాన్ని ఉపసమింప చేయడానికి వడపప్పు పానకం కూడా ఉంచి తప్పకుండ స్వీకరించాలి.లక్ష్మి పూజ చేసి దానాలు చెయ్యాలి. మీ శక్తిమేరకు దానాలు చేయవచ్చు. ఇలా మీరు చేయగలిగినంత దానం మీరు చేయడం వలన మీకు శుభం కలుగుతుంది. మీరు చేసిన ఆ దానం మీకు ధన లాభాన్ని తెచ్చిపెడుతుంది, అంతేకాకుండా పుణ్యం కూడా లభిస్తుంది.

ఇకపోతే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి. ఉగాది రోజున ఎవ‌రూ హెయిర్ క‌ట్ చేయించుకోకూడ‌ద‌ట‌. అలాగే గుండు చేయించుకోవ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా పెట్టుకోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా చేస్తే ఆ భగవంతుడికి ఆగ్రహం వస్తుందంట. దీంతో భ‌క్తుల‌కు క‌ష్టాలు ఎదుర‌వుతాయి. ఇంట్లో దేవుడికి పూజ చేసేట‌ప్పుడు దేవుడి ఎదుట క‌ల‌శం ఉంచాలి. అలాగే ఆ రోజు ఇంట్లో క‌చ్చితంగా ఎవ‌రో ఒక‌రు ఉండాలి. అంతేకానీ ఎవ‌రూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి. అందులో మొదటిది దక్షణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఉగాది రోజున ప్రశాంతంగా ఉంటూ , ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పండుగని సంతోషం గా జరుపుకోవాలి. అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలి. పాత వస్త్రాలు ధరించకూడదు. మరో ముఖ్యమైన అంశం ఉగాది రోజున మాంసం తినకూడదు. అలాగే మద్యం కూడా సేవించ కూడదు. ఇలా తెలుగు వారి తొలి పండుగ అయిన ఉగాది రోజున ఇవి పాటిస్తే.. మీకు మీ కుటుంబానికి చాలా మంచిది.

Content above bottom navigation