ఉల్లిపాయలని కట్ చేసినప్పుడు కళ్ళ నుండి నీరు ఎందుకు వస్తుంది..

193

తల్లి చెయ్యని మేలు ఉల్లి చేస్తుంది అని మనకు ఒక సామెత ఉంది. ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉల్లిపాయను కట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు రావడం మనం అందరం చూసే ఉంటాం…అసలు ఉల్లిపాయలను కట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనుక జరిగే రసాయనిక చర్య ఏంటి.. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

Image result for ఉల్లిపాయలని కట్ చేసినప్పుడు కళ్ళ నుండి నీరు

ఉల్లిపాయలని కట్ చేసినపుడు ఉల్లి పొరల నుండి ఒకరకమైన గ్యాస్ అనేది బయటకి విడుదల అవుతుంది. ఈ పొరలనుండి విడుదలయిన గ్యాస్ ఉల్లిపాయలలో ఉండే మరొక రసాయనముతో కలవడం వల్ల వేరొక కొత్త రకమైన గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన గ్యాస్ మన కంటిలోని తేమని తాకినప్పుడు మరొక కొత్త గ్యాస్ ఫామ్ అది కన్నీళ్లు రావడానికి కారణమవుడుతుంది. దీనిని గురించి కాస్త వివరంగా చెప్పాలంటే..

సాధారణంగా ఉల్లిపాయ పొరలలో సింథేజ్ ఎంజైమ్ కణాలు అనేవి పొదిగి ఉంటాయి. మనం ఉల్లిపాయలని కట్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలతో పాటుగా పొరలలో ఉన్న సింథేజ్ ఎంజైమ్ లు కూడా కట్ అయ్యి బయటకి వచ్చి అవి ఉల్లిపాయలలో గల ఎమినో ఆసిడ్ సల్ఫ్ ఆక్సైడ్ తో కలుస్తాయి. ఎంజైమ్ కణాలు మరియు ఎమినో ఆసిడ్ సల్ఫ్ ఆక్సైడ్ లు కలవడం వల్ల ప్రొపనితియాల్ S-ఆక్సైడ్ అనే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఈ ప్రొపనితియాల్ S-ఆక్సైడ్ అనేది మన కంటిని తాకినప్పుడు అది మన కంటిలో ఉన్న తేమతో కలిసి సల్ఫ్యూరిక్ ఆసిడ్ అనే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆసిడ్ కి మన కళ్ళని మండించే స్వభావం ఉండటం చేత మన కళ్ళు మండి ఉల్లిపాయల్ని కట్ చేసినప్పుడు కన్నీళ్లు రావడం అనేది జరుగుతుంది. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ముక్కు నుంచి కూడా నీరు కారుతుంది. చిత్రమేమంటే కన్నీరు తెప్పించే ఈ యాసిడ్ ఉల్లిపాయలను ఉడికించేప్పుడు వచ్చే కమ్మని వాసనకు కారణం. ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే, తరిగేముందు వాటిని నీటితో కడిగి తడిగా ఉంచాలి. అప్పుడు యాసిడ్ ఆ వాటర్ లో కరిగిపోతుంది.

Content above bottom navigation