ఉసేన్ బోల్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన ఇండియన్ ..health

138

ఉసేన్ బోల్ట్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరుగుపోటీలో ఉసేన్ బోల్డ్ ను ఎవ్వరూ అధిగమించలేరన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి ఉసేన్ బోల్ట్.. జమైకాకు చెందిన ఈ పరుగుల వీరుడు చిరుత కంటే వేగంగా పరుగెత్తగలడు. 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. ఐతే రన్‌ మెషీన్‌ ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే వ్యక్తి మన ఇండియాలో ఉన్నాడు. కర్నాటకకు చెందిన ఓ యువకుడు ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టాడు. కర్నాటక సంప్రదాయ క్రీడ కంబళ పోటీల్లో గేదెలతో బురద పొలాల్లో పరుగులు పెట్టి.. 30 ఏళ్ల కంబళ చరిత్రను సైతం తిరగరాశాడు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల యువకుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రి పట్టణానికి చెందిన శ్రీనివాస గౌడ(28) కంబాలా లేదా బఫెల్లో రేస్ లో పాల్గొని బురదతో ఉన్న మైదానంలో కేవలం 13.62 సెకన్లలో 142.5 మీటర్లు పరుగెత్తాడు. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తి రికార్డ్ సృష్టించాడు శ్రీనివాస్. అయితే వరల్డ్ రేస్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ కి 100మీటర్లు కవర్ చేయడానకి 9.58 సెకన్లు పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను చెరిపివేశాడు శ్రీనివాస్. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో దున్నపోతులు ఇన్వాల్వ్ అయ్యే సాంప్రదాయ రేస్ ను కంబాలా రేస్ అని పిలుస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ,ఉడుపి జిల్లాల్లోని రైతుల కమ్యూనిటీ ప్రతి ఏటా ఈ కంబాలా రేస్ పోటీలను నిర్వహిస్తుంటారు.

Image result for karnataka srinivasa gowda

అయితే శ్రీనివాస్ ఉసేన్ బోల్ట్ రికార్డు చెరిపివేశాడని చెప్పలేమని,శ్రీనివాస్ – ఉసేన్ బోల్ట్ రికార్డులను పోల్చి చూడలేనివని కొందరు అంటున్నారు. శ్రీనివాస్ ఒక జత దున్నపోతులకున్న తాడుని పట్టుకుని వాటితో పరిగెత్తాడు కాబట్టి, ఆ వేగం అనేది దున్నపోతుల నుంచి జనరేట్ అయినదని అంటున్నారు. కానీ రేసు ఒక బురద మైదానంలో నడిచింది కాబట్టి శ్రీనివాస్ ది రికార్డేనని మరికొందరంటున్నారు. పోలికలు లేకుండా కూడా, శ్రీనివాస్ గౌడ ఘనత చాలా గొప్పదే. అయితే ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయిన శ్రీనివాస్ అన్ని వైపుల నుంచి తనకు వస్తున్న అద్భుతమైన స్పందన చూసి ఆశ్చర్యం కలుగుతున్నట్లు చెప్పారు. శ్రీనివాస్ నమ్మశక్యం కానీ ఫీట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీనివాస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీనివాస్ గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం శ్రీనివాస్ ను ఒలంపిక్స్ కోసం ట్రైన్ చేయాలని కోరుతున్నారు. జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో కొన్నేళ్ల క్రితం కర్నాటకలో కంబాలా పోటీలపై నిషేధం కొనసాగింది. అయితే సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక చట్టం చేసి కంబాలా పోటీలకు అనుమతిచ్చారు.

Content above bottom navigation