ఏపీలో స్ధానిక సంస్ధల వేడి రాజుకుంది ఈనెలాఖరున పల్లె పోరు మున్సిపల్ పోరు ముగుస్తుంది.
మరి ఎవరికి అధికారం వస్తుందో ఈసారి చూడాల్సిందే.
అయితే నెలకో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
తాజాగా ఏపీలో 26 లక్షల మంది పేదలకు ఉగాది రోజున ఓ గుడ్ న్యూస్ అన్నారు.
ఆరోజు పేదలకు అర్హులు అయిన వారికి ఇంటిపట్టా అందిస్తాను అన్నారు
కాని పేదలకు ఈ వార్త ఆనందం కలిగించినా
ఇప్పుడు కాస్త నిరాశ కలిగిస్తోంది.
అవును స్ధానిక పోరుతో ఈ పట్టాల పంపిణీకి ఈసీ కండిషన్లు అప్లై అంటోంది.
మరి ఏమిటా అడ్డంకులు అనేది చూద్దాం.
తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుకున్న ఈ కార్యక్రమం పెండింగ్లో పడినట్లైంది. ఇది పేదలకు అందరికి షాక్ కలిగించింది, ఇప్పటికే చాలా మంది ఆరోజు పట్టాలు రావు అని భావించారు, ఈసీ బ్రేకులు వేస్తుంది అని అన్నారు, అలాగే జరిగింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ..ఉగాది పండుగ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ దీనికి ఈసీ నో చెప్పింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2020, మార్చి 07వ తేదీన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ ఉండడంతో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే..ప్రభుత్వం ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు చేయాలని నిర్ణయం తీసుకుందని, దీనిని ఆపివేయాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈసీకి కూడా పలు కంప్లయింట్స్ అందాయి. అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత..ఇళ్ల పట్టాలు ఇప్పుడు పంపిణీ చేయాల్సిన అవసరం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఈసీ సూచించింది. టోకెన్లు కూడా ఇవ్వకూడదని, ఈ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఈసీ చేసిన ఆదేశాల ప్రకారం ఉగాది పండుగకు ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా పడనుంది. తర్వాత ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.