ఏపీలో కొత్త వైరస్.. వారం పాటు చికెన్ మటన్ బంద్

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 1355 లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 60వేల మంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఈ వైరస్ భార‌త్‌ తో సహా 17 దేశాల్లోకి చొర‌బ‌డింది. కేర‌ళ‌లో ఇప్ప‌టికే క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనాపై అప్ర‌మ‌త్త‌మైంది. ఒక‌వైపు కరోనాపై క‌ల‌వ‌ర‌పడుతోన్న ఏపీని తాజాగా మ‌రో వైర‌స్ భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జంతువుల ప్రాణాలు తీస్తోంది. అదే హెర్సిస్ వైరస్. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి బారిన పడుతున్న మూగజీవాలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.

Image result for ఏపీలో కొత్త వైరస్.. వారం పాటు చికెన్ మటన్ బంద్

కోనసీమను లంపి స్కిన్ వ్యాధి వణికిస్తోంది. హెర్సిస్ వైరస్ వల్ల ఈ వ్యాధి మూగజీవాలకు వస్తుంది. ఒడిశా నుండి వచ్చిన ఈ వైరస్‌ కు మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తమ జంతువుల పాలిట శాపంగా మారిన ఈ లంపి స్కిన్ వైరస్ నుంచి కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాడి పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కోనసీమలో ఈ లంపి స్కిన్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముమ్మిడివరం, అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రావులపాలెం, కాట్రేనికోన, ఆలమూరు మండలాల్లో వేలాది పశువులు ఈ లంపి స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. ఇప్పటివరకు వెయ్యికి పైగా పశువులు ఈ వైరస్ బారిన పడగా వాటిలో ఇరవైకి పైగా ఆవులు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. ఈ వైరస్‌ బారిన పడితే, 104 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై కళ్లు, ముక్కు నుండి నీళ్లు కారడం, నోటి నుంచి చొంగ కారడంతో పాటు చర్మం కింద కణుతులు ఏర్పడి పుండుగా మారతాయంటున్నారు. పుండుగా మారిన కొన్ని రోజులకే జంతువులూ బలహీన పడి మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీని వలన పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోవడంతో పాటు పెరుగుదల కూడా తగ్గిపోతుందని అంటున్నారు.

Image result for ఏపీలో కొత్త వైరస్..

తూర్పుగోదావరి జిల్లాలో పశువులకు లంప్ స్కిన్ వైరస్ వ్యాపిస్తోంది. దీని బారినపడి ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులు మృతి చెందగా, వేల సంఖ్యలో పశువులు చికిత్స పొందుతున్నాయి. ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ఈ వైరస్ తూర్పుగోదావరి జిల్లాకు వ్యాపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. భారత దేశంలో ఈ వైరస్‌కు మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. లంపి స్కిన్ వైరస్ లేదా బొలైన్ హెర్సిస్ వైరస్ -2 అనే సూక్ష్మజీవుల వలన ఈ వ్యాధి వస్తుందంటున్నారు పశు వైద్యులు. ఈ వ్యాధి కీటకాలు, స్రావాలు, క్రిములతో కలుషితమైన గాలితో, ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకర పశువు శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన 4 నుంచి 14 రోజుల తరువాత ఈ వ్యాధి బయపడే అవకాశం ఉందంటున్నారు. ఈ వైరస్ పశువుల నుంచి కోళ్లకు ఇతర జంతువులకు కూడా వ్యాపించే అవకాశం ఉందనే పుకార్లు షికార్లు చేయడంతో కోనసీమ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation