ఒక భార్య… 11 మంది భర్తలు… ఇది కథ కాదు యదార్థ ఘటన..

సమాజంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.అయితే బాధపడాల్సిన విషయం ఏమిటి అంటే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే అమ్మాయిలు కూడా ఈ మధ్య మోసాలకు పాల్పడుతున్నారు. తమ దగ్గర ఉండే అందం అనే ఆస్తిని వలగా వేసి అందానికి బానిస అయ్యే మగవాళ్లకు చాలా ఈజీగా లూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మహిళా తన అందంతో ఏకంగా 11 మందిని ఎలా బురిడీ కొట్టించిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఆ యువతి పేరు మేఘా భార్గవ్. ఉత్తరప్రదేశ్‌లోని ఇండోర్ ఆమె స్వస్థలం.ఈమె అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం… ప్రేమంటే ఇదేరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ 28 ఏళ్ల మహిళ ధనార్జనకు వివాహాన్ని వృత్తిగా ఎంచుకుంది. వరుసబెట్టి 11 మంది జీవితాల్లోకి అర్ధాంగిగా ప్రవేశించింది. పెళ్లి కాని డబ్బున్న అబ్బాయిల వివరాలను మ్యాట్రిమొనీలో సేకరించి, వారికి తన ఫోటో పంపించేది. డబ్బున్న అబ్బాయిల్లో కూడా ఎవరైతే కొంచెం అందవికారంగా ఉంటారో, విడాకులు తీసుకున్న వారు, అంగ వైకల్యం కలిగి ఉంటారో అలాంటి వారినే ఆమె టార్గెట్ చేస్తుంది.

పెళ్లైన కొద్ది రోజులు అణకువ కలిగిన భార్యగా నటించి, అన్నీ దోచుకుని వెళ్లిపోవడం ఆమె స్టైల్.. ఈ ఘరానా మోసాలకు ఆమె చెల్లి, బావ కూడా సహకరిస్తుండటం కొసమెరుపు.ఆమె అందంగా ఉండటంతో తమ అదృష్టం కొద్దీ ఈ అమ్మాయి దొరికిందని భావించి ఆ యువతి గురించి అసలు వివరాలేవీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు ఈ యువతి మోసానికి బలయ్యారు. కోచికి చెందిన లోరెన్‌ జస్టిన్‌ అనే వ్యక్తి గత అక్టోబరులో తన భార్య మేఘ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేఘతో పాటు 15 లక్షల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Image result for ఒక భార్య… 11 మంది భర్తలు

కేరళ పోలీసుల బృందం నోయిడా పోలీసుల సాయంతో విచారణ చేసి.. రెండు నెలల తర్వాత మేఘతో పాటు ఆమె సోదరి ప్రాచి, సోదరి భర్త దేవేంద్ర శర్మలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి డబ్బు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విన్నారుగా అందాన్ని ఎరగా వేసి ఈ కిలాడి లేడి ఎంతటి పని చేసిందో…సో అమ్మాయి అందంగా ఉందని ముందూవెనుక ఆలోచించకుండా ప్రేమ, పెళ్లి అంటే మొదటికే మోసమొస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులు… బీ అలర్ట్.

Content above bottom navigation