కండలు పెరగడానికి తినాల్సిన ఆహారం..

295

ప్రతి ఒక్కరికి బలంగా, దృఢంగా ఉండాలని ఉంటుంది. శరీరం బలహీనంగా ఉండేవారిలో కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మన మనసు బలంగా ఉండాలంటే ముందు శరీరం బలంగా ఉండాలి. అందుకే బలిష్టమైన శరీరం కోసం చాలా మంది జిమ్ లో చేరి కష్టపడుతుంటారు. కానీ కొంతమంది ఎంత కష్టపడినా గానీ వారి శరీరంలో ఎటువంటి పెరుగుదల ఉండదు. దానికి కారణం జిమ్ లో ఎక్కువగా కష్టపడతారు కానీ సరైన ఆహారాన్ని తీసుకోరు. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే బాడీ పెరగడం అనేది 80% మనం తినే ఆహారం మీద, మిగిలిన 20% శాతం మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా సరైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు శరీరం పెరగడానికి ఏ ఆహారం ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం.

 1. గుడ్లు :
  గుడ్లలో శరీర పెరుగుదలకు కావలసిన అన్ని ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అలాగే తక్కువ ధరకు దొరికే మంచి ఆహారం కూడా. కాబట్టి ఉడకపెట్టిన గుడ్లను ఎక్కువగా తినండి.
 2. అరటిపళ్లు :
  అరటిపళ్ళు అనేవి శరీర పెరుగుదలకు, ముఖ్యంగా బరువు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంది ఉండాల్సిన దానికన్నా చాల తక్కువ బరువుంటారు. అలాంటి వాళ్లకు అరటిపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామం చేసిన తరువాత అరటి పళ్ళు తినడం ఎంతో మంచిది.
 3. పాలు, పాలకు సంబందించిన పదార్దాలు :
  పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. ఎందుకంటే పాలు ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్దాలు ఇలా అన్ని కలిసిన ఆహారం. కాబట్టి పాలను ఎక్కువగా తీసుకోండి. అలాగే పాలలో ఉన్న కాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి దోహదపడుతుంది. కేవలం పాలు మాత్రమే కాదు పెరుగు, నెయ్యి వంటి పాల పదార్దాలు ఎక్కువగా తీసుకోండి.
Image result for కండలు పెరగడానికి ఆహారం..
 1. బీన్స్ :
  తక్కువ కొవ్వుతో, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ బీన్స్ ని ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోండి. రోజుకి ఒక కప్పు బీన్స్ ని ఉడకపెట్టి లేదా కూరగా చేసుకుని తినండి. వీటిలోని ప్రొటీన్లు కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే మొలకెత్తిన గింజలు కూడా ఎక్కువగా తినండి.
 2. చేపలు :
  మాంసాహారంలో చేపల చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ వంటి చేపలు చాలా మంచివి. చేపలలో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్లు కండరాలు బలంగా పెరిగేలా చేస్తాయి.
 3. పీనట్ బటర్ :
  దీనిని వేరుశనగ గుళ్ళతో తయారు చేస్తారు. ఇది క్రీంలా ఉంటుంది. దీనిని బ్రెడ్ తో పాటుగా తీసుకోండి. దీని వలన ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. బ్రెడ్, పీనట్ బటర్ ని ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.
 4. బాదం :
  బాదంలో ప్రోటీన్ లతో పాటుగా మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మెటాబాలిజమ్ కు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతి రోజు 5 లేదా 6 బాదం గింజలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయం పూట తింటే చాలా మంచిది.
 5. చిలకడ దుంపలు :
  వీటిని కాల్చుకుని లేదా ఉడకపెట్టుకుని తినవచ్చు. ఇవి శరీర పెరుగుదలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయాలలో ఇది ఒక సంపూర్ణ ఆహారం. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అన్ని పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువుగా వీటిని తినండి

వీటితో పాటుగా ఆకుకూరలు ముఖ్యంగా పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ నీటికి ఎక్కువగా త్రాగండి. అలాగే తగినంత నిద్రకూడా చాలా అవసరం. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూనే ఇప్పుడు చెప్పిన ఆహార పదార్దాలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. దృఢమైన శరీరాన్ని పెంచాలనే మీ కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది.

Content above bottom navigation