కరోనా ఎఫెక్ట్ తో ఓ న‌ర్సు కూతురిని మిస్ అవుతూ చేసిన వీడియో …ప్ర‌పంచాన్నే క‌న్నీళ్లు పెట్టిస్తోంది.

124

చైనాలో క‌రోనా వైర‌స్ ర‌క్క‌సిగా మారింది
గంట‌కి ఐదుగురి ప్రాణాల‌ని హ‌రిస్తోంది
20రోజులుగా ఆస్ప‌త్రిలోనే ఉంటున్న డాక్ట‌ర్లు న‌ర్సులు
అత్య‌ధిక హెల్తె ఎమ‌ర్జెనీలో ఉన్న చైనా
కొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా మారిన‌ చైనా రోడ్లు

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను కబళిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 630 మందికి పైగా మరణించారు. మరో 31 వేల మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వుహాన్ నగరంలో పరస్థితి భయానకంగా ఉంది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారి శ్మశాన నిశబ్దం కమ్ముకోగా.. ఆస్పత్రులు రోగులు, అనుమానితులతో నిండిపోయాయి. ఈ భయానక పిశాచాన్ని తరిమికొట్టడానికి చైనా చాలా త్యాగాలు చేస్తోంది. కరోనాను అంతమొందించడానికి పోరాడుతున్న ఓ నర్సుతో ఆమె కుమార్తె ‘అమ్మా.. నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ గాల్లోనే సంజ్ఞలు చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి.

చైనాలోని హనాన్‌ ప్రావిన్స్‌ ఫుగావ్‌ కౌంటీలోని పీపుల్స్‌ ఆస్పత్రిలో లీ హయాన్ అనే నర్సు కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ నర్సు దగ్గరకు ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె ఓ సంచి తీసుకొని వచ్చింది. ఇద్దరూ మాస్క్‌లు ధరించి ఉన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ చిన్నారి ‘అమ్మా నిన్ను మిస్‌ అవుతున్నా’ అంటూ గాల్లోనే హగ్‌ ఇస్తూ చేతులు ముందుకు చాచింది. ఆ నర్సు కూడా కన్నీళ్లు పెడుతూ.. గాల్లోనే చేతులు చాచి హగ్ ఇచ్చింది. కలుసుకోవడానికి నిషేధం ఉండటంతో ఆ తల్లీబిడ్డలిద్దరూ ‘ఎయిర్ హగ్’ ద్వారా తమ ప్రేమను పంచుకున్నారు.

నర్సు లీ హయాన్ పది రోజులుగా తన కుమార్తెను కలవలేదు. ‘ఇక్కడ నేను కరోనా పిశాచితో పోరాడుతున్నా. దాన్ని తరిమికొట్టాక ఇంటికి తిరిగొస్తా’ అంటూ ఆ నర్సు తన కుమార్తెకు జాగ్రత్త చెప్పింది. త‌ర్వాత ఆ పాప తన వెంట తీసుకొచ్చిన సంచిని అక్కడ ఉంచి దూరంగా జరగగా.. ఆ సంచి తీసుకొని నర్సు కన్నీళ్లు కారుస్తూనే విధుల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది

ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు ఎంతటి త్యాగాలు చేస్తున్నారో అంటూ కీర్తించారు. కరోనాపై పోరులో చైనా గెలిచేందుకు దేవుడు సాయం చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

కరోనా వైరస్ బయటి ప్రపంచానికి వ్యాపించకుండా చైనాలోని హుబీ ప్రావిన్స్ త్యాగమే చేస్తోంది. 60 మిలియన్ల ప్రజలు ఉండే వుహాన్ నగరం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి వైద్యులు, అధికారులు అనేక త్యాగాలు చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ అహర్నిశలూ శ్రమిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ముఖాలకు ధరించే మాస్కులు, వైద్య పరికరాల కొరత పుండు మీద కారం చల్లినట్లుగా మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నాయి. కరోనా బాధితులకు చికిత్స కోసం చైనా ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని నిర్మించిన విషయం తెలిసిందే. చైనా ధైర్యాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. చైనా అధ్యక్షుడితో మాట్లాడిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. నిజంగా డాక్ట‌ర్లు దేవుళ్లు అని అందుకే అంటాం, ఎంద‌రి ప్రాణాల‌నో చైనాలో డాక్ట‌ర్లు కాపాడుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation