కరోనా కంటే డేంజర్ హంటా వైరస్… క్షణాల్లో గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు.

158

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ తొలిసారి చైనాలో వెలుగుచూసిన విషయంలో తెలిసిందే. హుబే ప్రావిన్సులను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి.. దాదాపు 40300 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం కరోనా అక్కడ తగ్గుముఖం పట్టింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 184 దేశాలను ఈ మహమ్మారి వణికిస్తుంది. అన్ని దేశాలు కూడా ఈ మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా చాలామంది దీని బారిన పడుతున్నారు. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని మోదీ దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా పూర్తిగా కనుమరుగు కాకముందే హంటా వైరస్ వచ్చేసింది.

చైనాలో హంటా భారీన పడి ఒక వ్యక్తి చనిపోవడంతో ప్రపంచ జనాభా భయభ్రాంతులకు గురవుతోంది. చైనాలో పుట్టిన ఈ హంటా వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉండటం గమనార్హం. దాదాపు 4 లక్షల మంది కరోనా భారీన పడగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో హంటా వైరస్ ప్రజల మీద దాడి చేయడానికి సిద్ధమైంది. చైనా ప్రజలు ఎలుకలు తింటారనే విషయం తెలిసిందే. ఎలుకల్ని తినడం వల్ల ఈ వైరస్ భారీన చైనాలో చాలా మంది పడ్డారని సమాచారం. ఒక వ్యక్తి ఈ వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే మరణించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. చైనా కొత్త వైరస్ గురించి గోప్యత పాటించినా ఒకరు వైరస్ భారీన పడి మృతి చెండంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాన్ డాన్గ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ పుట్టినట్లు తెలుస్తోంది. కరోనా కంటే ఈ వైరస్ మరీ డేంజర్ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Image result for హంటా వైరస్

వైరస్ సోకిన వ్యక్తి కొన్ని గంటల్లోనే మృతి చెందడంతో ప్రజలందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనాలో వైద్యులు సూచిస్తున్నారు. హాంటావైరస్ వ్యాధికి ఎలుకలే కారణం. ఈ వైరస్‌కు ఎలుకలు ప్రధాన వాహకాలు. ‘ఇంటిలో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల ఉంటే హాంటావైరస్ వ్యాపించే ప్రమాదంగా ఉంది. ఈ వైరస్ బారిన పడితే సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా హెచ్‌పిఎస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. హెచ్‌పీఎస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది. ఈ వైరస్ సోకినవారిలో హెచ్‌పీఎస్ రోగుల మాదిరిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయి. అలాగే, వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తాజాగా ఈ వైరస్ మరింత డేంజర్ అంటూ వస్తున్న వార్తలు ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. ప్రజలు కచ్చితంగా శుభ్రత పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ ల భారీన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తాజాగా ఈ వైరస్ మరింత డేంజర్ అంటూ వస్తున్న వార్తలు ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. ప్రజలు కచ్చితంగా శుభ్రత పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ ల భారీన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Content above bottom navigation