కరోనా నేపథ్యంలో… ఫేస్ బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం

156

క‌రోనా దెబ్బ‌కి ప్రపంచం మొత్తం అత‌లాకుతం అవుతోంది.
ఉద్యోగులు వ్యాపారులు ఎవ‌రి ప‌ని వారు చేసుకోలేక‌పోతున్నారు.
వైర‌స్ వార్త‌లు మ‌నిషికి మ‌రింత టెన్ష‌న్ పెంచుతున్నాయి.
చూస్తూ చూస్తూ ఇట‌లీ ఏకంగా చైనాని దాటేసింది
మ‌న దేశంలో కూడా ఇది పంజా విసురుతోంది
నార్త్ నుంచి సౌత్ కి కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతోంది
ప‌లు ఐటీ కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కాన్సెప్ట్ ని తీసుకువ‌చ్చాయి.
అయితే కొన్ని కంపెనీలు సెల‌వులు ఇస్తున్నాయి.
తాజాగా ప్ర‌పంచంలో మేటి సోష‌ల్ మీడియా దిగ్గ‌జ కంపెనీ ఫేస్ బుక్ ,
ఈ క‌రోనా వ‌ల్ల ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
ఇది ప్ర‌పంచ కంపెనీల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది

ఏమిటి ఆ నిర్ణ‌యం అనేది చూద్దాం

త‌మ సంస్థలో పని చేస్తున్న 45 వేల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఆరు నెలల వేతనాన్ని బోనస్ గా అందిస్తున్నామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో, తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఈ డబ్బులు కేటాయించుకోవాలని, వర్క్ ఫ్రమ్ హౌమ్ చేసే సదుపాయం కల్పించిన వారికి అదనంగా మరో 1000 డాలర్లు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఈ 1000 డాలర్లతో ఇంటి నుంచి పని చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ సదుపాయం ఉండదని తెలిపారు.

Image result for facebook ceo

ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న ఫేస్ బుక్ కార్యాలయాల్లో లాక్ డౌన్ ప్రకటించినా, వారు విధులకు రాకపోయినా పూర్తి వేతనం ఇస్తామని జుకర్ బర్గ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు ఉద్యోగులకు సమయం అవసరమని, ఆ విషయం తమకు తెలుసునని అన్నారు. ఈ మేరకు అధికారిక మెమోను జారీ చేసిన ఆయన, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియను ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే అదనపు వ్యయాన్ని సంస్థ భరిస్తుందన్నారు.

ఫేస్ బుక్ లో ఉద్యోగి సగటు వార్షిక వేతనం 2018లో 2.28 లక్షల డాలర్లుగా ఉంది. ఇప్పటికే సియాటెల్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని కొవిడ్-19 భయంతో తాత్కాలికంగా మూసివేశారు. మిగతా కార్యాలయాల్లో చాలా వరకూ మూతబడ్డాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తీసుకున్న నిర్ణ‌యం పై మిగిలిన టెక్ కంపెనీలు షాక్ అయ్యాయి, త‌మ అంత పెద్ద శాల‌రీలు బోన‌స్ లు ఇవ్వ‌లేమ‌ని, తాము కూడా జీతాలు క‌ట్ చేయ‌కుండా ఇస్తాము అని చెప్పారు, మొత్తానికి ఇప్పుడు ఆయ‌న ప్ర‌క‌ట‌న టెక్ కంపెనీలో స‌రికొత్త చ‌ర్చ‌కు కార‌ణం అయింది.

Content above bottom navigation