కరోనా పంజా, ప్రజలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

25

తెలంగాణ‌లో ఈ క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ పెరుగుతోంది
దీని వ్యాప్తి మ‌రింత పెర‌గ‌డంతో స‌ర్కారు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది
ఇత‌ర ప్రాంతాల నుంచి ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారి వ‌ల్ల ఈ వ్యాధి సోకుతోంది
అయితే 6 కేసుల నుంచి రాత్రికి రాత్రి 13 కేసులు న‌మోదు అయ్యాయి తెలంగాణ‌లో
దీంతో పెద్ద ఎత్తున చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా తెలంగాణ స‌ర్కారు రంగం సిద్దం చేసుకుంటోంది.

తెలంగాణ‌లో బుధవారం రాత్రి ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వాస్తవానికి 2020, మార్చి 18వ తేదీ బుధవారం సాయంత్రం వరకు కొవిడ్‌ కేసులు 6 నమోదయ్యాయి… రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. మొత్తంగా బుధవారం ఒక్క రోజే 8 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Image result for cm kcr

ఈ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్ కేంద్రాల సందర్శనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారి కోసం ఎవరూ వెళ్లకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది… సెల‌వులు ఇచ్చింది టూర్లు తిర‌గ‌డానికి కాద‌ని దీనిని సీరియ‌స్ గా తీసుకోవాలి అని తెలిపారు, ఇక పార్కుల‌కి కూడా పిల్ల‌ల‌ను తీసుకువెళ్ల‌వ‌ద్దు అని చెబుతున్నారు.. గుంపులుగా ప‌ది మంది క‌లిసి గ్రూపులుగా మాట్లాడద్దు అని చెబుతున్నారు.

కరీంనగర్‌లో కరోనా డేంజర్‌ బెల్‌ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 11మందిలో ఏకంగా ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్‌ పట్టణంలో హైఅలర్ట్‌ ప్రకటించింది. కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల మేర దిగ్బంధించారు. ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. అక్కడ ఉన్న వారిని బయటకు రానివ్వడం లేదు. అందరినీ ఒక రకంగా గృహ నిర్భంధం చేశారు.

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీనంగర్‌ కలెక్టర్‌. వైరస్‌ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. దుకాణాలు, హోటళ్లు మూసివేయించి అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు బస చేసిన ప్రార్థనా మందిరాలను రసాయనాలతో శుభ్రపరిచారు. ఆ ప్రాంతమంతా మందులు, బ్లీచింగ్‌ పౌడర్‌ స్ర్పే చేశారు. అంతేకాదు 144 సెక్షన్‌ను విధించి ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు… దీని పై ప్ర‌తీ రెండు మూడు గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు.

Content above bottom navigation