కరోనా బాధితులకు అక్కడి డాక్టర్ల స్పెషల్ ట్రీట్‌మెంట్.. వీడియో చూడాల్సిందే..

99

కరోనా భయం రోజురోజుకు ఎక్కువవుతోంది. దాదాపుగా లక్ష మంది బాధితులు ఈ మహమ్మారితో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. వీరిలో కొంతమంది కోలుకునే సూచనలు ఉన్నాయి. అయితే బాధితులు కోలుకోవడంతో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు డాక్టర్లు. వారు చేసే సేవ ఎంత అయినా త‌క్కువే అని చెప్పాలి, అస‌లు ఈ వ్యాధి త‌గ్గుతుందో లేదో తెలియ‌దు అయినా స‌రే త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా క‌రోనా రోగుల‌కి చికిత్స అందిస్తున్నారు.

ఎంతో జాగ్రత్తల మధ్య కరోనా బాధితులకు చికిత్సను అందిస్తూ తాము దేవుడితో సమానమని అందరికీ గుర్తుచేస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా బాధితుల్లో డాక్టర్లు ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌లో వైద్యులు కరోనా బాధితుల కోసం స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కేవలం మెడిసిన్ మాత్రమే ఇవ్వకుండా మానసికంగా కరోనా బాధితులు ధృడంగా ఉండేందుకు అక్కడి వైద్యులు డాన్సులు వేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియోను స్థానిక జర్నలిస్ట్ నెగర్ మోర్తజవి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Image result for covid docters dance

వనరులు, పరికరాలు కొరతగా ఉన్నప్పటికీ.. ఇరాన్‌లోని డాక్టర్లు, నర్సులు కరోనాతో యుద్ధం చేస్తున్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు అని ఆ వీడియోకు ఆమె కామెంట్ పెట్టారు. ఇక ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అందరూ వావ్.. సూపర్.. నిజంగా మీరు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా చైనా తరువాత కరోనా బాధితుల సంఖ్య ఇరాన్‌లో పెరుగుతోన్న విషయం తెలిసిందే.

ఇరాన్ లోనే కాదు చాలా దేశాల్లో ఇప్పుడు కరోనా వైర‌స్ సోకిన వారిని ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అంటున్నారు, ఎందుకు అంటే మ‌నిషిని భ‌య‌మే స‌గం చంపేస్తుంది, ఆందోళ‌న వ‌ల్ల బీపీ గుండెజ‌బ్బులు కూడా వ‌స్తాయి, అందుకే ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు డాక్ట‌ర్లు… ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ ఇండోనేషియా మ‌లేషియా దేశాల్లో డాక్ట‌ర్లు 12 గంట‌ల డ్యూటీలు చేస్తున్నారు నైట్ షిఫ్టుల్లో కూడా వ‌ర్క్ చేస్తున్నారు, అంతేకాదు ఆ రోగులకి ఆహ‌రం కూడా తినిపిస్తున్నారు, మీకు ఏమీ కాదు అని భ‌రోసా ఇస్తున్నారు, వారికి క‌రోనా గురించి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామో చెబుతున్నారు, వీడియో కాలింగ్ ద్వారా వారి కుటుంబ స‌భ్యుల‌తో కూడా మాట్లాడిస్తున్నారు.

నిజ‌మే దేవుడు డాక్ట‌ర్ల రూపంలో వ‌చ్చి ఇలా వారిని కాపాడుతున్నారు అని చెబుతున్నారు రోగులు వారి బంధువులు.. దాదాపు చైనాలో 7 ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు న‌ర్సులు ఈ క‌రోనాపై యుద్దం చేస్తున్నారు, అక్క‌డ కూడా ప‌రిశుభ్ర‌త పాటిస్తున్నారు, మాంసాహ‌రం మానేశారు, ఇప్పుడు చైనాలో వెజిటేబుల్స్ దొర‌క‌డం లేదు అంటే అక్క‌డ ప‌రిస్దితి ఎలా ఉందో ఆలోచించుకోండి.

Content above bottom navigation