కరోనా బూచి రాబోయే 15 రోజులు ఎంత ప్రమాదకరమో తెలుసా

కరోనా వైర‌స్ అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది..
దీని ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంటోంది.
మ‌న దేశంలో దీనిని నివారించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నాయి
విదేశాల నుంచి వ‌చ్చిన వారిపై ప్ర‌త్యేకంగా ఫోకస్ చేశారు.
మ‌న దేశంలో ఉన్న 210 కేసుల్లో ఎక్కువ ఇత‌ర దేశం నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌వే
అయితే ఇప్పుడు మ‌న దేశంలో క‌రోనా స్టేజ్ -2లో ఉంది
దీని ప్ర‌భావం ఎలా ఉంటుంది ?
తర్వాత ఏ విధంగా దీని ప్ర‌భావం మారుతుంది ?
ఈ వైర‌స్ దూకుడు స్టేజ్ ల రూపంలో ఎలా మారుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

మన దేశంలోకి కరోనా వైరస్ రెండో దశలోకి చేరుకుంది … వైద్య వర్గాలు కొన్ని రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైద్య వర్గాల సమాచారం ప్రకారం కరోనా వైరస్ నాలుగు దశలుంటాయి. మొదటి దశలో విదేశాలల్లో వైరస్ సోకిన వారి ద్వారా మనదేశంలోని వాళ్ళకి రావటం. రెండో దశ ఏమిటంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన వారి ద్వారా మనదేశంలో వ్యాపించటం. ప్రస్తుతం మనదేశంలో వైరస్ రెండో దశలోకి చేరుకుంది.

ఇక మూడు, నాలుగో దశలు చాలా భయంకరంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉందంటేనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయో అందరూ చూస్తున్నదే. ఈ దశను దాటి మూడో దశలోకి వైరస్ వ్యాప్తి ప్రవేశిస్తే ఇక ప‌రిస్దితి చేయి దాటిపోతుంది.. వైరస్ ను మూడో దశలోకి ప్రవేశించనివ్వ‌కూడ‌దు అనే పట్టుదలతోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి..

కరోనా బూచి : రాబోయే 15 రోజులు ఎంత ప్రమాదకరమో తెలుసా  ?

మూడో దశ ఏమిటంటే వైరస్ సోకిన వారు యధేచ్చగా ఆఫీసులకు, బహిరంగ ప్రాంతాల్లో తిరగటం, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవ్వటం ద్వారా అందరికీ ఈ వ్యాధి అంటించటం అవుతుంది. ఇదే గనుక జరిగితే వైరస్ ను అరికట్టటం ప్రభుత్వాల వల్ల సాధ్యంకాదు. అందుకనే వైరస్ ఉందనే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండమని చెబుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరొకరికి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ విషయం మీదే ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి.

ఇక నాలుగో దశ ఏమిటంటే వైరస్ వ్యాప్తిపై నియంత్రణ కోల్పోవటం. ఈ దశకు వస్తే మరణాలను ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలు నాలుగో దశకు చేరుకున్నాయి. అందుకనే ఆ దేశాల్లోని రోగులకు క్వారన్ టైన్లు, ఆసుపత్రులు సరిపోవటం లేదు. పైగా మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చైనాలో వైరస్ నాలుగో దశలో ఉండటం వల్లే మరణాలు వేలల్లో ఉన్నాయి. మూడు, నాలుగో దశలకు చేరుకుంటే ఆరోగ్య వ్యవస్ధ కుప్ప కూలినట్లే అనుకోవాలి. అదృష్ట వశాత్తు మనదేశంలో రెండో దశలోనే ఉంది కాబట్టే మూడో దశకు రాకూడదని ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

దీనికి జనాలు కూడా పూర్తిగా సహకరించాలి. ఏమాత్రం జాగ్రత్త‌లు తీసుకోక‌పోయినా ఈ వైర‌స్ మ‌న‌పై ప్ర‌భావం చూపుతుంది, మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటేకాదు అవ‌త‌ల వ్య‌క్తి కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి, అందుకే దేశంలో ప్ర‌తీ ఒక్క‌రూ ఈ నియమాలు పాటిస్తే వీలైనంత త్వ‌ర‌గా మ‌న దేశం ఈ వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది అని చెబుతున్నారు వైద్యులు.

Content above bottom navigation