కరోనా వైరస్‌ను సబ్బు ఎలా చంపుతుందో తెలుసా ?

60

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్‌ సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు మూతపడుతున్నాయి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరుల నుంచి దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. కానీ, ఆ సలహాలను పాటించడం ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అంత సులువు కాదు. ప్రపంచ పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రజలు మురికివాడల లాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారికి సరైన నివాస సదుపాయాలు ఉండవు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండదు. దాంతో, అంటువ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతాయి.

ఇక రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ పై ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రచారం చేస్తున్నారు. అలా కొత్త కొత్త పద్దతులలో వినూత్నంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిలో రాచకొండ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో రోడ్డు కూడలివద్ద సిగ్నల్ పడిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రయోగాత్మకంగా కరోనా కట్టడి గురించి ప్రచారం చేసారు. రాచకొండ పోలీసులు ఇటీవల రోడ్లపై సిగ్నళ్ల వద్ద కూడా చేతులు ఎలా కడుక్కోవాలనే అంశాన్ని చేసి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోశల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాక, రాచకొండ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలూ చేపడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతున్నారు. తాజాగా మరో వీడియోని రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శానిటైజర్లు లేకపోయినా సబ్బుతో చేతులు కడుక్కోవచ్చని దాన్ని ఎలా అందుబాటులో ఉంచుకోవాలనే విషయాన్ని వివరించే ఓ వీడియో షేర్ చేశారు. కరోనా వైరస్‌ను సబ్బు ఎలా నిర్మూలిస్తుందో ఆ వీడియోలో ఉంది.

Image result for కరోనా వైరస్‌ను సబ్బు

సాధారణంగా వైరస్‌లు ఫ్యాటీ లేయర్ కలిగి ఉంటాయని, ఇవి సాధారణ నీటికి లొంగవని ఆ వీడియోలో ప్రయోగాత్మకంగా వివరించారు. దానికి సబ్బు తోడైతే అందులోని, ఫ్యాటీ లేయర్‌ను విచ్ఛిన్నం చేసే గుణాలు క్రిములను సర్వనాశనం చేస్తాయని చూపించారు. ‘‘శానిటైజర్ లేకపోతే సబ్బును జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను ముందూ వెనుక కడుక్కోవటం మర్చిపోవద్దు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్స్ ఫిదా అయ్యారు. కరోనా నిర్ములన విషయంలో ప్రజలు ఈ వీడియో నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. శబాష్ పోలీసులు అంటూ కొనియాడుతున్నారు.

Content above bottom navigation