కాఫీ తెచ్చి ఇచ్చిన రూమ్ బాయ్ కు ట్రంప్ ఇచ్చిన టిప్ ఎంతో తెలుసా?

143

భారత పర్యటనకు ట్రంప్ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చాడు ట్రంప్. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం వెళ్లారు. ఆ తరువాత అహ్మదాబాద్ లో ఉన్న మొతేరా క్రికెట్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ పోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ అందాలను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని అక్కడ మౌర్య హోటల్ లో బస చేశారు. అయితే ఆ హోటల్ లో కాఫీ తెచ్చి ఇచ్చిన రూమ్ బాయ్ కు ట్రంప్ ఇచ్చిన టిప్ ఎంతో తెలిసి యావత్తు భారతావని షాక్ కు గురవుతుంది.. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని మౌర్య హోటల్ వాతావరణం ట్రంప్ దంపతులకు ఎంతగానమో నచ్చింది. హోటల్ సిబ్బందితో ట్రంప్ ఫామిలీ ఎంతో సరదాగా గడిపారు. ముఖ్యంగా ఇవాంక అక్కడి సిబ్బందితో కలిసి తిరిగి హోటల్ ప్రత్యేకతలు తెలుసుకుంది. వాళ్ళను అడిగి సిటీ వివరాలు మొత్తం తెలుసుకున్నారు. అయితే రోజు రాత్రి పడుకునే ముందు ట్రంప్ కు కాఫీ తాగే అలవాటు ఉంది. దాంతో కాఫీ తెమ్మని హోటల్ యాజమాన్యానికి ఆర్డర్ ఇచ్చారంట. దాంతో ట్రంప్ ఫామిలీ కోసం ఏర్పాటు చేసిన చెఫ్ కాఫీ రెడీ చేసి, రూమ్ బాయ్ తో పంపించాడంట. అయితే కాఫీ తెచ్చిన రూమ్ బాయ్ కు ప్రవర్తన ట్రంప్ కు బాగా నచ్చిందంట. అందుకే ఆ రూమ్ బాయ్ కూడా అదిరిపోయే టిప్ ఇచ్చి పంపించాడంట. దాంతో ఆ రూమ్ బాయ్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

Image result for trump room boy

అదే విషయాన్నీ ఆ రూమ్ బాయ్ తన సన్నిహితులతో షేర్ చేసుకోవడంతో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇంతకు ఆ రూమ్ బాయ్ కు ట్రంప్ ఇచ్చిన టిప్ ఎంతో తెలుసా?అక్షరాలా 15 వేల డాలర్స్ ను చెక్ రూపంలో టిప్ ఇచ్చాడంట ట్రంప్. అంటే మన కరెన్సీలో దాదాపు 10 లక్షలకు పైమాటే. ఆ రూమ్ బాయ్ సర్వ్ చేసిన విధానం నచ్చిన ట్రంప్ అతనికి 15 వేల డాలర్స్ చెక్ రూపంలో ఇవ్వడమే కాకుండా, ఆ హోటల్ యాజమాన్యానికి, ఆ చెక్ ను ఇండియన్ రూపీస్ రూపంలోకి మార్చి అతనికి ఇవ్వమని ఆర్డర్ వేశారంట. నిజానికి ఆ రూమ్ బాయ్ నెలజీతం కేవలం 20 వేల రూపాయలు మాత్రమే. ఈ లెక్కన చుస్తే ట్రంప్ ఇచ్చిన 10 లక్షలు సంపాదించాలంటే ఆ రూమ్ బాయ్ కు పదేళ్లు అయినా సరిపోదు. అందుకే ఇప్పుడు అతని ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఇలా ఒక్క దెబ్బతో అతని సమస్యలు అన్ని తీరిపోయాయి. ట్రంప్ చేసిన ఈ సహాయం అతని జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ అధినేత వచ్చినా కూడా హోటల్ బాయ్ తో ఇలా వ్యవహారించరు. కానీ అతని సర్వ్ నచ్చిన ట్రంప్, అతని హోదాకు తగ్గట్టు టిప్ ఇవ్వడంతో ఆ రూమ్ బాయ్ జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయి. ఇక ఈ వార్త హోటల్ సిబ్బంది అందరికి తెలియడంతో, అందరు ట్రంప్ కుటుంబాన్ని మెచ్చుకున్నారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా పడి, సోషల్ మీడియాలోకి ఎక్కడంతో బాగా వైరల్ అయ్యింది.

Content above bottom navigation