కాబోయే మొగుడే కదా అని కాస్త చనువిస్తే ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే షాక్..

ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కొన్నిసార్లు మహిళల పాలిట రాక్షసిగా మారుతోంది. దీన్ని ఆయుధంగా చేసుకుని కుర్రాళ్లు అమ్మాయిలను బెదిరిస్తున్నారు. నగ్న వీడియోలను దక్కించుకొని, అమ్మాయిల బలహీనతను అడ్డు పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే కాబోయే మొగుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ దరిద్రుడు ఆ అమ్మాయికి చుక్కలు చూపించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఇంతకు ఏమైందో పూర్తీగా ఇప్పుడు తెలుసుకుందాం.

అవనిగడ్డకు చెందిన అమ్మాయికీ గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్‌ అనే అబ్బాయికీ ఈ మధ్యనే పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి ఫిక్స్ అయినా వారానికే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఎంగేజ్ మెంట్ సమయంలో అమ్మాయి, అబ్బాయి కాస్త క్లోజ్ గా ఉండటం మామూలే కదా. అలాగే ఈ అమ్మాయి కూడా అబ్బాయితో కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యింది. ఆ సమయంలో కొన్ని సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ విజయ్ భాస్కర్ మరింత అడ్వాన్స్ అయ్యాడు. కాబోయే భార్య అనుకున్నాడో ;ఇక ఇంకేమైనా అనుకున్నాడేమో కానీ ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. పెళ్లికి ముందే వేధింపులకు దిగాడు. నువ్వు నాకు కాబోయే భార్యవు. నిన్ను ఏమైనా అనే అర్హత నాకు ఉంది. నేను చెప్పినట్టు విను. లేకుంటే నాకు కోపం వస్తుందని తన నిజ స్వరూపాన్ని చూపించాడు.

కాబోయే మొగుడే కదా అని కాస్త చనువిచ్చింది.. రెచ్చిపోయిన ఆ దరిద్రుడు ఎంత పని చేశాడంటే..?

దీంతో అతని ప్రవర్తన నచ్చక ఆ అమ్మాయి అతని గురించి ఇంట్లో చెప్పింది. దాంతో పెళ్ళికి ముందే ఇలా ఉన్నాడంటే, పెళ్ళయాక ఇంకెలా ఉంటాడో అని భయపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి క్యాన్సిల్ అవ్వడాన్ని విజయ్ భాస్కర్ కు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. దీంతో ఆ అమ్మాయికి, వాళ్ళ ఫామిలీ వాళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. దానికోసం ఒక ప్లాన్ వేశాడు. ఎంగేజ్ మెంట్ టైమ్ లో అమ్మాయితో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేశాడు.. అంతేకాకుండా అమ్మాయి పేరుతో క్రియేట్‌ చేసిన మెయిల్‌ తో ఆమె బంధువులకు, ఫ్రెండ్స్ కూ ఈ ఫోటోలు పంపడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా కొన్ని ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులతో కలిసి యువతి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు అతనిపై సైబర్‌ సెక్షన్ల కింద అరెస్టు చేసి లోపలేశారు. అతడు తీసిన ఫోటోలు, అతని ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా పెళ్లి క్యాన్సిల్ చేశారని ఎంత దారుణానికి ఒడిగట్టాడో. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి.

Content above bottom navigation