కారణాలు లేని వింత విదిరాతలు…. వింత పిల్లలు..

197

మహిళలు జన్మనిచ్చినప్పుడు, వారు కోరుకునేది మాత్రం ఆరోగ్యకరమైన శిశువును చూడాలనుకోవడం. వాళ్లకు పుట్టే బిడ్డ చాలా ఆరోగ్యంగా, ఎలాంటి అవలక్షణాలతో జన్మించకూడదు అని అనుకుంటారు. కానీ కొందరు దురదృష్టం కొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారు. ఆ అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే వినడానికే భయం పుట్టేలా ఉంటాయి. అలా పుట్టిన కొంతమంది పిల్లల గురించి ఇప్పుడు చెబుతా వినండి.

  1. మహ్మద్ ఖలిమ్..
    ఇతను ఇండియాకు చెందినవాడే. జార్ఖండ్ రాష్టానికి చెందినా మహ్మద్ ఖలీం పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. కానీ కొంతకాలానికి అతని వేళ్ళు విపరీతంగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే, పెద్దవాళ్ళ చేతి వేళ్ళ కన్నా కనీసం ఐదురెట్లు పెద్దగా ఉన్నాయి. అలా అవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. ఇక అతని చెస్ట్ కూడా నార్మల్ గా కంటే పెద్దగ ఉంది. ఇతనిని ఎవరు కూడా స్కూల్లో చేర్చుకోలేదు. ఇతర పిల్లలు భయపడతారు అనే కారణంతో చదువుకు దూరం చేశారు. తోటి పిల్లలు హేళన చేస్తుంటే ఆ బాధను దిగామింగుకున్నాడు. వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో పిల్లాడికి ట్రీట్ మెంట్ కూడా ఇప్పించడం లేదు. మూడనమ్మకాలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో పిల్లాడికి ఏదో శాపం తగిలింది అని అక్కడి వాళ్ళు అనుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపించినా కూడా ఎవరు కూడా ఈ సమస్య ఏంటో చెప్పలేకపోతున్నారు. ఖలిం గురించి న్యూస్ పేపర్ లో రావడంతో, దానిని చుసిన డాక్టర్ సభాపతి ఫ్రీగా వైద్యం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. కొంతమంది డాక్టర్స్ బృందంతో వచ్చిన సభాపతి ఆపరేషన్ చేసి చేతి వేళ్ళను సగానికి కట్ చేశాడు. ఇప్పుడు అవి పెరగడం లేదు. దీంతో ఖలిం ను స్కూల్ లో కూడా చేర్చుకున్నారు. ఇంతకు ఆ పిల్లాడి చేతి వేళ్ళు ఎందుకు పెరుగుతున్నయంటే అది ఒక సిండ్రోమ్ జనరికల్ సమస్య అంటా.
  2. పీటర్ ప్యాట్..
    ఇతను చిన్నప్పుడు అందరిలా స్కూల్ కు వెళ్లి చదువుకునేవాడు. కాని ఎప్పుడైతే టీనేజ్ లోకి వచ్చాడో అప్పటినుంచి పెరగడం ఆగిపోయింది. ఆ వ్యాదిని 10 వ తరగతి వరకు తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేదు. 10 వ తరగతి కంప్లీట్ అయినా కూడా అతని మొహం పిల్లాడిలాగానే ఉంటుంది. వాయిస్ కూడా చిన్నపిల్లలగానే వస్తుంది. దీంతో అతను మాట్లాడటం కూడా తగ్గించాడు. అతని వయసు చెప్తే కాని ఎవరికీ తెలిసేది కాదు. ఒకసారి తన 21 ఏట పుట్టినరోజు చేస్తుంటే, బయటనుంచి వచ్చిన అమ్మాయిలు పిల్లాడు సరదాగా ఉన్నాడని ఆట పట్టించారంట. అతని తల్లి అసలు వయసు చెప్పడంతో అందరు షాక్ అయ్యారంట. ఇతనిని ఎంతమంది డాక్టర్స్ కు చూపించినా కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు, ఏం చెయ్యలేకపోతున్నారు. ఇది ఒక హై ల్యాండర్ సిండ్రోమ్. ఇది ఉన్న వాళ్ళకు చర్మం చిన్నపిల్లలాగ మృదువుగా ఉంటుంది. వెంట్రుకలు కూడా పెరగవు. వాయిస్ చిన్నపిల్లలగా ఉంటుంది. ఎ ఏజ్ లో గ్రోత్ ఆగిపోతే వాళ్ళు అక్కడే ఉంటారు.
Image result for కారణాలు లేని వింత విదిరాతలు
  1. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. చూస్తేనే భయం వేసేలా ఉండి కదా. ఇది ఒక బేబి ఫోటో. అయితే ఇది నిజంగా జన్మించిన పాప కాదు. కొందరు మనుషులు తయారుచేసిన బేబి డాల్. కాని కొందరు ఇది నిజంగానే బేబి అని, ఒక వింత వ్యాది వలన ఇలా పుట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాని ఇది నిజం కాదు.
  2. చార్లేట్..
    ఈ పాప పుట్టినప్పుడు కేవలం 800 గ్రాముల బరువు మాత్రమే ఉంది. ఇక పొడవు 28 అంచులు మాత్రమే. ఇక ఆమె మొహం రూపం మనిషిలా లేదు. శరీరం మొత్తం మనిషిలా ఉన్నా, హ్యూమన్ క్వాలిటీస్ సరిగ్గా లేవు. గుండె దగ్గర నుంచి అన్ని కూడా నార్మల్ గా ఉండాల్సిన దానికంటే రెండు రెట్లు చిన్నవిగా ఉన్నాయి. ఇక ఆమెను చెక్ చేసిన డాక్టర్స్ ఆమె ఎక్కువ రోజులు బతకదు అని కూడా చెప్పారు. అయినా ఆమె తల్లి ఆ పాపను చాలా జాగ్రతగా చూసుకుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషంగానే జీవిస్తుంది ఆ పాప. కాని సైజ్ మాత్రం ఇప్పటికి తక్కువగానే ఉంది. ఇప్పుడు ఆ పాపకు 9 ఏళ్ళు. అయినా కూడా ఎలాంటి ఎదుగుదల లేదు. ప్రాణం ఉందంటే ఉంది అంతే. ఏడాది కూడా బతకదు అని చెప్పినా కూడా, చార్లేట్ ఇంకా జీవిస్తుంది. అయితే ఈ పాప ఇలా ఎందుకు ఎదగాలేకపోతుంది అనే విషయం గురించి ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు.
Content above bottom navigation