కుక్క చేసిన పనికి ఆగిపోయిన ఎంగేజ్ మెంట్.. ఏం చేసిందో తెలిస్తే షాక్

మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయా? మీ ఇంట్లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకిలా చెప్తున్నానో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇంట్లో కుక్క పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. అవి చేసే అల్లరి భలే ముద్దొస్తుంది. కానీ, ఇంట్లో సామాన్లు నాశనం చేసినప్పుడే కోపం వస్తుంది. ఇదిగో ఈ కుక్క పిల్ల చేసిన పనికి.. ఆ ఇంట్లో పెద్ద రచ్చే జరిగింది. పెళ్లి నిశ్చితార్థం కోసం కొనుగోలు చేసిన ఖరీదైన ఉంగరాన్ని కుక్క మింగేయడంతో ఆ ఇంట్లోవాళ్లు తలలు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image may contain: one or more people and outdoor

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ యువతి పెప్పర్ అనే కుక్కను పెంచుకుంటోంది. ఈ యువతికి ఈ మధ్యనే పెళ్లి సంబంధం ఒకే అయ్యింది. ఇంకొక నాలుగు రోజుల్లో ఎంగేజ్ మెంట్ కూడా పెట్టుకున్నారు. నాలుగు రోజుల్లో ఎంగేజ్ మెంట్ కావడంతో ఖరీదైన రింగును తెచ్చుకుని ఇంట్లో టేబుల్ మీద పెట్టింది. అయితే అది తినే వస్తువనుకుందో లేదా ఆ పెళ్లి పెప్పర్‌ కు ఇష్టం లేదేమో గానీ ఆ ఉంగారాన్ని ఆ కుక్క గుటుక్కుమని మింగేసింది. అయితే అది మింగినప్పుడు ఇంట్లో ఎవరు కూడా చూడలేదు. కొద్దిసేపటి తర్వాత రింగు కనిపించకపోవడంతో ఆ యువతి ఇల్లంతా వెతికింది. కానీ రింగ్ ఎక్కడ కూడా కనిపించలేదు.

ఈ క్రింద వీడియో చూడండి:

అయితే ఆ యువతి రింగ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ కుక్క కూడా అక్కడే ఉంది. దాంతో కుక్క మీద డౌట్ వచ్చింది. ‘‘రింగు కనిపించడం లేదు చూశావా’’ అని ఆమె పెప్పర్‌ను ప్రశ్నించింది. దీంతో అది బిక్క ముఖం వేసి, బిత్తర చూపులు చూసింది. దీంతో అదే దాన్ని మింగేసి ఉంటుందని ఆ యువతికి అనుమానం వచ్చింది. కుక్క మింగిందో లేదో ముందు నిర్దారణ చేసుకోవాలని వెంటనే పెప్పర్‌ను పట్టుకుని వ్యాలీ ఫామ్ అనే పశువుల ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ డాక్టర్స్ కు జరిగిన విషయం చెప్పి, కుక్కను స్కాన్ చెయ్యమని కోరింది. దాంతో కుక్క కడుపుకు ఎక్స్‌రే చేసిన డాక్టర్లు ఎట్టకేలకు ఉంగరాన్ని గుర్తించారు. ఇక కడుపులో ఉన్న రింగ్ ను ఎలాగైనా బయటకు తీయమని డాక్టర్స్ ను కోరుకుంది. కుక్క కక్కితే గానీ ఆ రింగ్ బయటకు రాదు. అందుకే ఆ కుక్కతో కక్కించేందుకు మందు ఇచ్చారు. దీంతో కడుపులో ఉన్నదంతా కక్కడం మొదలుపెట్టింది. చివరికి ఉంగరాన్ని కూడా బయటకు కక్కేసింది. దీంతో ఆ యువతి హమ్మయ్యా! అని గుండెల మీద చేయి వేసుకుంది.

No photo description available.

ఈ ఫన్నీ ఘటనను వ్యాలీ ఫామ్ పశువుల ఆసుపత్రి తమ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఫన్నీగా వెల్లడించింది. ‘‘నా పేరు పెప్పర్. నా ముఖం వికారంగా కనిపిస్తోంది కదూ. నాకు వాంతి అయ్యేందుకు డాక్టర్ నాకు ఏదో మందు ఇచ్చాడు. ఎందుకంటే.. నేను నా అమ్మ ఎంగేజ్మెంట్ రింగును మింగేశాను. ఎందుకని మాత్రం అడగొద్దు. అప్పడు అదే మంచి ఐడియా అనిపించింది. ఏది ఏమైనా ఆ ఉంగరం ఎట్టకేలకు బయటకు వచ్చేసింది’’ అని ఆ కుక్క మాట్లాడుతున్నట్లుగా పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Content above bottom navigation