కూతురికి వెలకట్టలేని కట్నం.. ఎడ్లబండి నిండా..

84

కట్నం చట్టపరంగా నిషేధం. అయితే చట్టానికి తూచ్ కొట్టేసి కట్నాలు ఇచ్చేసేవాళ్లు, పుచ్చుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. కట్నం కింద డబ్బులు, బంగారం, బంగ్లాలు ఇస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం కూతురికి చాలా విలువైనవి కట్నంగా ఇచ్చి పంపించాడు. పెళ్లి సమయంలో “నాన్న నాకు పెళ్లి కానుకగా 50 తులాల బంగారం కావాలి”..”అక్కకి రూ. 10 లక్షలు ఇచ్చి నాకు రూ. 5 లక్షలే ఇస్తున్నావ్”..”పెళ్లి కానుకగా నాకు మంచి కారు కొనివ్వండి”..ఇవి పెళ్లి సందర్భంగా కొంతమంది కూతుర్లు తమ తండ్రులను అడుగుతోన్న కానుకలు. కానీ గుజరాత్ చెందిన ఓ అమ్మాయి పెళ్లి కానుకగా తన తండ్రిని పుస్తకాలు కొనివ్వమని అడిగింది. తాను ఎంత బరువుంటే అంత తూకం వచ్చే విధంగా బుక్స్ కావాలని కోరింది. అయితే ఆ తండ్రి తన కూతురు పెళ్లి రోజు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 2200 పుస్తకాలను కొనిచ్చారు. అది కూడా తన కుమార్తె ముందు పెళ్లి రథంపై వెళ్తంటే..వెనుక ఎడ్లబండిలో 2200 పుస్తకాలను నింపి ఊరేగింపుగా తీసుకొచ్చి అందించారు. ఇందుకోసం ఆయన 6 నెలల పాటు కష్టపడ్డారు. వాటిని చూడగానే ఆ పెళ్లి కూతురి ఫేస్ ఆనందంతో వెలిగిపోయింది.

గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన కిన్నరిబా జడేజాకు చిన్నప్పుటి నుంచే పుస్తకాల పురుగుగా పేరుంది. తండ్రి హర్దేవ్ సింహ్ జడేజానే చిన్నప్పటి నుంచి ఆమెకు పుస్తకాలు చదివే అలవాటు చేశారు. స్కూల్ పుస్తకాలూ మాత్రమే కాదు సమాజానికి పనికొచ్చే ఎన్నో పుస్తకాలను ఆమె చదివేది. దీంతో లైఫ్ అంటే పుస్తకాలే. పుస్తకాలూ చదవని లైఫ్ వేస్ట్ అనే ఫీలింగ్ కు వచ్చింది. సమయం దొరికితే చాలు ఏదో ఒక పుస్తకం కావాలి ఆమెకు. ఈ నేపథ్యంలో కుమార్తె పెళ్లీడుకొచ్చింది. పెళ్లి సమయంలో ఎవరైనా తండ్రిని అంత బంగారం కావాలి.. ఇన్ని పట్టు చీరలు కావాలి అని కోరుతారు. కానీ జడేజా కూతురు మాత్రం తండ్రిని కేవలం పుస్తకాలే కావాలని కోరింది. తన పెళ్లికి తాను ఎంత బరువుంటే అంత తూకం వచ్చే విధంగా బుక్స్ కావాలని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి కుమార్తె కోరినంత కాకుండా ఇంకా ఎక్కువ పుస్తకాలు బహూకరించి ఆమెని ఆశ్చర్యానందానికి గురిచేశారు.

Father.

పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్తుంటే వెనుక బండిలో పెళ్ళికూతురికి ఇచ్చే సామాన్లు పంపిస్తారు. కానీ జడేజా తన కూతురు ముందు పెళ్లి రథంపై వెళ్తంటే.. వెనుక ఎడ్లబండిలో 2200 పుస్తకాలను నింపి ఊరేగింపుగా తీసుకొచ్చి అందించారు. అయితే ఈ పుస్తకాలూ అన్ని పెళ్ళికి ముందు కొనలేదు. ఈ పుస్తకాల కోసం ఆ నాన్న 6 నెలల పాటు కష్టపడ్డారు. తన కూతురికి పుస్తకాలూ అంటే ప్రాణం అని తెలిసి పెళ్ళికి 6 నెలల ముందు నుంచే పుస్తకాలూ సేకరించాడు. తండ్రి ఇచ్చిన ఈ అద్భుతమైన కానుకను చూసి ఆ పెళ్లి కుమార్తె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇక పెళ్లికొచ్చిన వాళ్ళు అయితే ఇలాంటి పుస్తకాల పురుగును ఎక్కడ చూడలేదని, ఈ తండ్రి చాలామంది గిఫ్ట్ ను కూతురుకు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

Content above bottom navigation