కూరగాయల సంచిలో బతికున్న పాము…

133

మీరు కూరగాయల మార్కెట్ కు వెళ్లి అక్కడ ఒకేసారి కిలోల్లో ఉన్న బంగాళదుంపల సంచిని కొంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మారిస్సా డెవిడ్‌ అనే మహిళా. ఓ సూపర్‌ మార్కెట్‌లో బంగాళ దుంపల సంచిని కొని ఇంటికి తీసుకెళ్లిన క్రమంలో ఆమె ఓ భయంకర అనుభవాన్ని ఎదుర్కొన్నానంటూ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. మరి ఆ మహిళ ఎదుర్కొన్న ఈ భయంకరమైన అనుభవం ఏంటనే వివరాల్లోకి వెళ్తే…

ఆస్ట్రేలియాకు చెందిన మారిస్సా డెవిడ్‌ అనే మహిళ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసిస్తుంది. ఆమె భర్త ఇక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. అయితే ఆమె రెండు రోజుల క్రితం కూరగాయల కోసం సూపర్ మార్కెట్ కు వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన కూరగాయలతో పాటు 4 కిలోల బంగాళ దుంపల సంచిని కొనింది. ఆ తర్వాత సంచితో సహా కొన్న బంగాళాదుంపలను ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత బంగాళదుంపలను తీసే సమయంలో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎందుకంటే ఆ సంచిలో ఒక బతికున్న పాము కనిపించింది. దాంతో ఆ మహిళ భయాందోళనకు గురైంది.

పామును చుసిన మారిస్సా ఒక్కసారిగా ఉలిక్కపడి సంచికి దూరంగా పరిగెత్తింది. అయితే ఆ సంచిని విప్పే సమయంలో ఆమె కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ పాము సంచి నుంచి బయటకు దూకి ఆ మహిళ ఐదేళ్ల కొడుకు వైపు పాకింది. కుమారుడికి పాము అపాయం తలపెడుతుందని భావించిన మారిస్సా వెంటనే అప్రమత్తమై, అక్కడే ఉన్న వాక్యూమ్ క్లీనర్ సహాయంతో పామును చంపేసింది. అప్పుడు ఊపిరి పీల్చుకుంది.

Image result for కూరగాయల సంచిలో బతికున్న పాము…

ఇక తానూ ఎదుర్కొన్న ఈ ఘటన గురించి అందరికి తెలియాలని చనిపోయిన పాము ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటనపై మారిస్సా మాట్లాడుతూ.. ‘ఇది నా జీవితంలో ఎదుర్కొన్న మొట్టమొదటి భయంకరమైన ఘటన..కూరగాయల సంచిలో పామును చూడగానే నాకు వెన్నులో వణుకుపుట్టింది. దీని నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్న. సరిగా నిద్ర కూడా పట్టడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక జరిగిన ఘటనపై సూపర్‌ మార్కెట్‌ నిర్వహకులు కూడా స్పందించి ఆమెను క్షమాపణలు కోరినట్లు ఆమె చెప్పారు. చూశారుగా కూరగాయల సంచి అని ఇంటికి తీసుకొస్తే బుసలు కొడుతూ పాము ఎలా బయటకు వచ్చిందో.. కాబట్టి మీరు కూడా మార్కెట్ లో ఇలాంటి సంచులు కొనేముందు అక్కడే ఒక్కసారి చెక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లండి.

Content above bottom navigation