కేసీఆర్ కు జలక్ ఇచ్చిన ఇవాంక…ఏం చేసిందో తెలిస్తే షాక్

58

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విందులో మొత్తంగా 90 నుంచి 95 వీఐపీలు మాత్రమే పాల్గొననున్నట్టు సమాచారం. వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, అసోం, హరియాణా, బిహార్‌ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం ఈ విందు జరగనుంది. అయితే విందు కోసం వెళ్లిన కెసిఆర్ కు ట్రంప్ కూతురు ఇవాంక షాకిచ్చిందంట. అసలేమైందంటే..

ఢిల్లీ చేరుకున్న కెసిఆర్, ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర భవన్ కు చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఒక మీటింగ్ లో ట్రంప్ కూతురు ఇవాంక ఉందంట. కెసిఆర్ చేరుకునే సమయానికే ఇవాంక మీటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ఇవాంక అక్కడే ఉందని తెలిసిన కెసిఆర్, ఆమెను కలుసుకోవాలని అనుకున్నాడంట. ఇదే విషయాన్నీ కెసిఆర్ తన పిఏతో కబురు పంపించాడంట. కెసిఆర్ పిఏ వెళ్లి ఇవాంక సిబ్బందితో ఇదే విషయాన్నీ చెప్తే, ఆమె కలవడానికి అంగీకరించలేదంట. తనకు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో, అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలనుకుంది. అందుకే కెసిఆర్ తో మీటింగ్ కు ఆమె ఒప్పుకోలేదు. ఇదే విషయాన్నీ ఇవాంక సిబ్బంది కెసిఆర్ పిఏ కు చెప్పారంట. ఇక ఇవాంక మీటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో, సాయంత్రం జరిగే రాష్ట్రపతి విందులో ఆమెను కలవనున్నారు. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ఆమెకు రాచరిక మర్యాదలు చేశారు. గోల్కొండ కోటను ఆమెను సందర్శించారు.

Image result for ivanka kcr

ఇక ఈరోజు రాత్రికి జరిగే విందులో ట్రంప్ దంపతులను కెసిఆర్ స్పెషల్ గా కలవనున్నారు. ట్రంప్‌తో పాటు మెలానియా, ఇవాంకకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను సీఎం బహూకరించనున్నారు. అలాగే పలు కంపెనీల విషయాల గురించి, అలాగే అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళ గురించి, ఇండియన్స్ గురించి కూడా కొన్ని చర్చలు జరపనున్నారు కెసిఆర్. రేపు హైదరాబాద్‌కు సీఎం తిరిగి వస్తారు. కాగా, విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.

Content above bottom navigation