కోటీశ్వరుల గ్రామం ఆ గ్రామంలో అన్నీ హెలికాప్టర్లే…?

ఈ ప్రపంచంలో ఎన్నో గ్రామాలూ ఉన్నాయి.అయితే కొన్ని గ్రామాలకు కొన్ని స్పెషాలిటీలు ఉంటాయి.వాటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.అలాంటి ఒక గ్రామం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కోటీశ్వరులే.ప్రతి ఒక్కరి దగ్గర కోట్ల డబ్బు ఉంటుంది.అంతేనా అక్కడ ఉండేవారికి సదుపాయాలన్నీ ప్రభుత్వమే ఇస్తుంది.ఆశ్చర్యకరంగా ఉంది కదా..మరి ఆ గ్రామం గురించి దాని విశేషాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

అది చైనాలోని ఒక చిన్న గ్రామం. పేరు హువాక్సి. ఈ గ్రామాన్ని 1961 లో కనిపెట్టారు. ఈ గ్రామంలో మల్టి సెక్టార్ ఇండస్ట్రీ ఉంది. ఇది చైనాలోనే రిచెస్ట్ విలేజ్. అయితే స్థానికుల కథనం ప్రకారం ఈ మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ స్టాక్ ఎక్సచెంజ్ లిస్ట్ లో కూడా ఉంది. ఆ కంపెనీలో ఈ గ్రామస్థులంతా షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. ప్రతి సంవత్సరం కంపెనీకి వచ్చే లాభాల్లో ఐదో వంతు గ్రామా ప్రజలకు వెళ్తుంది. 2011 లో ఆ కంపెనీ టర్నోవర్ 6.5 బిలియన్ యువాన్స్ గా ఉంది. అందుకే ఈ గ్రామం చైనాలోనే ధనిక గ్రామంగా పేరుగాంచింది.

Image result for కోటీశ్వరుల గ్రామం

ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరి దగ్గర మిలియన్ యువాన్స్ సంపద ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఒక్కొక్కరి దగ్గర కోటి రూపాయలు ఉన్నట్టు. అంతేకాకుండా వీరికి ఇల్లు కారు అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇంటి సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఈ గ్రామంలో అత్యంత్య ఎత్తైన భవనం ఉంది. దీనిలో 72 అంతస్తులు ఉన్నాయి. ఇది చైనాలోనే అత్యంత్య ఎత్తైన భవనాల్లో 15 వ స్థానంలో ఉంది.

దాదాపు 272 విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రామంలో ఒక పెద్ద పార్క్ కూడా ఉంది. ఈ పార్క్ లో ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బయటవాళ్ళు కూడా వెళ్ళవచ్చు. ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించదు. కేవలం ఆ గ్రామా ప్రజలకు మాత్రమే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుంది. చదువు వైద్యం అన్ని ఉచితమే. కానీ అవన్నీ హువాక్సి గ్రామా ప్రజలకు మాత్రమే. అయితే ఈ గ్రామ ప్రజలకు ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గ్రామా ప్రజలకు సెలవులు ఇవ్వదు. ప్రతిరోజు 10 గంటలు వర్క్ చెయ్యాల్సిందే. ఒకవేళ గ్రామం నుంచి వెళ్లాలంటే అన్నిటిని వదులుకోవాలి. ఇక్కడ బార్స్ క్లబ్స్ వంటివి నిషేధం. ఏమైనా ఎంజాయ్ చెయ్యాలంటే బయట వేరే గ్రామాలకు వెళ్లే చెయ్యాలి. అది కూడా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకున్నాకా, రాత్రిపూట వెళ్లి చేసి రావాలి.

Content above bottom navigation