కోహ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టాక ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా?

విరాట్ కోహ్లి. చేజింగ్ వీరుడు. ఇండియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. క్రికెట్ లో అవతలి టీమ్ లో ఎవరున్నా సరే, సెంచరీలు కొట్టే ఈ బ్యాట్స్ మాన్ కి వ్యక్తిగతంగా కూడా అభిమానులున్నారు. ఎందుకంటే మంచి హృదయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కారణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతోఇష్టం చూపిస్తూ, శ్రద్ధ పెట్టడం వల్లనే ఇప్పుడు నెంబర్ పొజిషన్ కి వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ ది క్రికెట్ గా ఇతడిని వ్యవహరిస్తుంటారు. సచిన్ తర్వాత మరొక సచిన్ అనే పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులార్టీ విరాట్ కోహ్లీ ఎంతోకష్టపడి సాధించుకున్నాడు.

Image result for kohli luxury life

వరల్డ్ లో టాప్ 100 అథ్లెట్స్ లో విరాట్ 7వ ప్లేస్ లో ఉన్నాడంటే ఇతడి క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ లో ఏ క్రికెటర్ కి లేని క్రేజ్ ఇతడి సొంతం. కష్టపడడంతో పాటు పేద విద్యార్థులకు సాయం చేయడం అతడి నిజమైన ఆస్తిగా చెబుతారు. అతడికి వచ్చే సంపాదనలో దాదాపు 20 శాతం పేద విద్యార్థులకు, అనాధ ఆశ్రమాలకు వెచ్చిస్తాడు. అయితే విరాట్ కోహ్లీ ఆస్థి ఎంత, ఏడాదికి క్రికెట్ నుంచి ఎంత సంపాదన చేస్తాడు, ఒక్కో మాక్ కి ఎంత దక్కించుకుంటాడు వంటి వివరాల్లోకి వెళ్తే… ఇతడి మొత్తం ఆస్థి 420 కోట్లు. ఒక్క ఏడాదికి క్రికెట్, యాడ్స్ పరంగా 110 కోట్లు సంపాదిస్తాడు. ఐపీఎల్ నుంచి ప్రతి ఏడాది 13 కోట్ల రూపాయలు వస్తాయి. ఇక ఇండియా తరుపున ఆడుతున్నందుకు ఒక్కొక్క మ్యాచ్ కు 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈ లెక్కన ఏడాదికి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కోహ్లీకి ఒక సొంత జిమ్ ఉంది. అలాగే వ్రాగన్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ ఉంది. దీని నుంచి కూడా బాగానే సంపాదిస్తున్నాడు. అలాగే MRF కంపెనీతో డీల్ ఉంది. దీనికి గాను 8 ఏళ్లకు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

Image result for kohli cars

అలాగే ISL ఫుట్ బాల్ టీమ్ కు కో ఓనర్. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ నుంచి కూడా కోహ్లీకి బాగానే సంపాదిస్తున్నాడు. కోహ్లీకి హర్యానాలోని గుర్గాన్ లో 80 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. అలాగే ముంబైలో 30 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది. అలాగే ఢిల్లీలో 15 కోట్ల విలువ చేసి ఇల్లు ఉంది. ఇక కోహ్లీ లగ్జరీ కార్ల విషయానికి వస్తే..5 సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి. 83 లక్షల విలువ చేసే ఆడి Q7, 2 కోట్లు విలువ చేసే ఆడి A8, 2.47 కోట్లు విలువ చేసే ఆడి R8 V 10 plus, 80 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్, 1.2 కోట్లు విలువ చేసే BMW X6 ఉన్నాయి. అలాగే కోహ్లీ సొంతంగా ఓ చార్టర్ ఫ్లయిట్ కూడా రన్ చేస్తున్నాడు. ఇలా కోహ్లీ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నాడు. ఓవరాలుగా కోహ్లీ వద్ద 420 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోహ్లీ క్రికెట్ లోకి వచ్చిన తర్వాతనే సంపాదించాడు. అంతకుముందు కోహ్లీ కుటుంబం చాలా బీద పరిస్థితిలో ఉండేది. చాలా చిన్న ఇంట్లో కోహ్లీ ఫామిలీ ఉండేది. ఎప్పుడైతే క్రికెట్ లోకి ఎంటర్ అయ్యాడో, అప్పటినుంచి కోహ్లీ లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఉంటూ, ఇండియన్ టీమ్ ను నెంబర్ 1 స్థానంలో ఉంచాడు. కోహ్లీ ఇలాగె ఇండియన్ టీమ్ కు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation