క‌రోనా వైర‌స్ గురించి భ‌యంక‌ర‌మైన విష‌యం వెలుగులోకి ప్రపంచ వినాశ‌న‌మే

క‌రోనా వైర‌స్ గురించి భ‌యంక‌ర‌మైన విష‌యం వెలుగులోకి ప్రపంచ వినాశ‌న‌మే

కరోనా వైర‌స్ ని చాలా త‌క్కువ‌గా అంచనా వేసింది చైనా
కాని దాని ప్ర‌భావం ఇప్పుడు తెలుస్తోంది, అంత‌కంత‌కూ విస్త‌రిస్తూ చైనా అంతా ఈ వైర‌స్ భ‌య‌పెడుతోంది
కోట్లాది మందికి ఈ వైర‌స్ ఇప్పుడు పెను స‌వాల్ విసురుతోంది.
పాజిటీవ్ కేసులు పెరుగుద‌ల పక్క‌ళో బ‌ల్లెంలా చైనాకి మారింది.

.చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ బారిన పడి దాదాపు 700 మంది మృత్యువాతపడ్డారు అని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 వేల మందికి ఈ మాయదారి వైరస్ సోకింది….వారిలో 42 వేల మంది చైనాలోనే ఉన్నారు. ఓ పక్క కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేందుకు బ్రిటన్ – అమెరికా – చైనాతో పాటు పలు దేశాల శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈ శరవేగంగా వ్యాపిస్తోన్న ఈ కరోనా పిశాచికి అడ్డుకట్ట వేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ…..ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. తాజాగా హాంకాంగ్ కు చెందిన ప్రముఖ మెడికల్ ఆఫీసర్ గాబ్రియల్ లియంగ్ చేసిన హెచ్చరిక వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సాధ్యమైనంత త్వరలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుంటే ప్రపంచంలో దాదాపు 60 శాతానికి పైగా జనాభా ఈ వైరస్ బారిన పడి చనిపోతారని లియంగ్ సంచలన విషయాలు వెల్లడించారు.

Image result for karona virus

కరోనా వ్యాప్తిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అరికట్టాలని – దాంతోపాటు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని లియంగ్ హెచ్చరించారు. కరోనా వైరస్ సోకిన ప్రతి రోగి ద్వారా మరో రెండున్నర శాతం మందికి ఈ వ్యాధి సోకుతోందని లియంగ్ చెప్పారు. దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 శాతం మందిని ఈ వైరస్ కబళించే అవకాశముందని వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం మృతుల సంఖ్యకు లియంగ్ చెప్పిన గణాంకాలు సరిపోవడం లేదు. అయితే కరోనా మృతుల వివరాలు – వైరస్ బారిన పడ్డ వారి వివరాల సరైన సంఖ్యను చైనా వైద్యాధికారులు వెల్లడించడం లేదన్న ఆరోపణల వ‌స్తున్నాయి…తాజాగా లియంగ్ గణాంకాలు ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైరస్ను గుర్తించే మెడికల్ కిట్లు తక్కువగా ఉన్నాయని – లక్షలాది ప్రజలకు పరీక్షలు నిర్వహించాలని అంటున్నారు.

కరోనా వైరస్ ను డిసెంబరు నెలలోనే గుర్తించిన చైనా యువ వైద్యుడి మాటలను చైనా సర్కార్ పెడ చెవిన పెట్టింది. చివరకు వాస్తవాన్ని గ్రహించే సరికి పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో ఆ యువ వైద్యుడితో సహా 700 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. ఇపుడు అదే తరహాలో లియంగ్ చేస్తున్న హెచ్చరికలను కూడా ప్రపంచ దేశాలు సీరియస్ గా తీసుకుంటాయా…లేక లైట్ తీసుకుంటాయా అన్న సంగతి ఆసక్తికరంగా మారింది. అయితే దీనిని అన్నీ దేశాలు సీరియ‌స్ గా తీసుకున్నాయి.. ఈజీగా ఈ వ్యాధి వ‌స్తుంది కాబ‌ట్టి లియంగ్ చెప్పేది వాస్త‌వ‌మే అంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation