గాంధారి 101 మంది కౌరవులను ఎలా కనిందో తెలుసా?

197

తింటే గారెలే తినాలి..వింటే భారతమే వినాలి. మ‌హాభార‌తం…. దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎన్నో వేల శ్లోకాలతో, ప‌ర్వాల‌తో ఉంటుందిది. అనేక క‌థ‌లు ఇందులో ఉన్నాయి. అయితే చాలా మందికి మ‌హాభార‌తంలో ఉన్న క‌థ‌లేమిటో తెలుసు. కానీ కొన్ని క‌థ‌ల గురించి మాత్రం కొంద‌రికి ఇప్ప‌టికీ తెలియ‌దు. ముఖ్యంగా గాంధారి గురించి అంతలా తెలీదు. 101 మంది ఉన్న కౌరవులకు తల్లి గాంధారి. ఇది విన్నప్పుడు, అసలు గాంధారి అంతమందికి జన్మ ఎలా ఇచ్చింది అనే సందేహం వస్తుంది.. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

voice…

కురు వంశానికి చెందిన ధృతరాష్ట్రుడుని గాంధారి వివాహమాడింది. అయితే చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండు రాజుకు దక్కింది. ఈ విషయం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురి చేసింది. అందుకే పాండురాజు – కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని అనుకున్నారు. ఆ తర్వాత తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు. కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనంద పడింది. కాని ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది. ఆమె కన్న కలలను ఆవిరి చేసింది. గర్భం వచ్చిన కూడా రెండేళ్ళ పాటు బిడ్డకు జన్మనివ్వలేకపోయింది.

మరోపక్క కుంతీ తన మొదటి కుమారుడు ధర్మరాజుకు జన్మనిచ్చింది. దీంతో గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణచుకోలేకపోయింది. తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది. ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. దీంతో దృతరాష్టుడూ వ్యాస మహర్షిని అక్కడకు పిలిపించారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని కోరారు. దాంతో వెంటనే వంద నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు. ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది. 101 సీసాలు సిద్ధం కాగానే, వ్యాస మహర్షి మాంసపు ముద్దను 101 భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఒక్కొక్క సీసాలలో ఉంచారు. ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు. అలా కొన్ని రోజులు భద్ర పరిచిన తర్వాత ఆ మాంసం ముద్దలు ప్రాణాలు పోసుకున్నాయి. ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు, ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. 100 మంది కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి దుశ్శాల.

Image result for గాంధారి 101 మంది కౌరవులను

ఇక శ్రీకృష్ణుడి మరణానికి ఈ గాంధారి పెట్టిన శాపమే కారణమని అంటారు. కురుక్షేత్ర యుద్ధానికి తర్వాత పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు. కానీ కౌరవులను యుద్ధంలో కోల్పోయిన వారి తల్లి గాంధారి మాత్రం ఆవేదనతో కూడిన కోపంతో రగిలిపోతుంది. తాను ధర్మ ప్రకారం నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఒక్కడూ మిగలకపోవడంపై గాంధారి ఆవేశం వ్యక్తం చేస్తుంది. ఇదే కోపంలోనే పాండవుల రాజ్యాభిషేకానికి వచ్చిన శ్రీకృష్ణుడిని శపిస్తుంది. “కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను. నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించింది గాంధారి. ఈ శాపం ప్రకారం శ్రీకృష్ణుడు 36 ఏళ్ల తర్వాత మరణించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇలా గాంధారి మహాభారతంలో ముఖ్య పాత్రనే పోషించింది.

Content above bottom navigation