ఘోరమైన తప్పు చేస్తున్న భారత ప్రభుత్వం… మారకపోతే దేశం వల్లకాడు అవ్వడం ఖాయం

58

ప్రపంచవ్యాప్తంగా 184 దేశాలు కరోనావైరస్ కబంధ హస్తాల్లో విలవిల్లాడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ సోకినవారి సంఖ్య 4,70,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 21 వేలు దాటింది. ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనావైరస్ వల్ల అత్యంత ప్రభావితమయ్యే తర్వాత దేశం భారత్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ 650కి పైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ 13 మంది మృతిచెందారు. ఇక కరోనా వైరస్ ను అరికట్టేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాడు. దీని వలన కేసులు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. అయినప్పటికి మే నెల మధ్యభాగంలో మనదేశంలో 13 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు .

ఇదేంటి ప్రస్తుతం కేవలం 600 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న మన దేశంలో మరొక నెలన్నర రోజులకి ఒక్కసారిగా 13 లక్షల కేసులు బయటపడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ? విషయమేమిటంటే కొంతమంది పరిశోధకులు కోవిడ్ -19 స్టడీ గ్రూప్ , ఇంటర్ డిసిప్లినరీ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ మరియు డేటా సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో కరోనా పాజిటివ్ కు సంబంధించిన టెస్టుల ప్రక్రియ యొక్క తరచుదనం గమనించినట్లయితే మార్చి 18 వ తారీఖు వరకు కేవలం 11,500 మందికే కరోనాకి సంబంధించిన టెస్ట్ లు జరిపారు . దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ రెండవ దశకు చేరుకున్న సమయంలో ఇంత తక్కువ మందికి టెస్టులు జరపడం అన్నది చాలా ఆందోళనకరమైన విషయం. సరిగ్గా ఇప్పుడు భారత్ ఉన్న సమయంలోనే అమెరికా కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించింది .

Image result for modi

ఇటలీ కూడా దాదాపు మార్చి 18 కి 11 రోజుల క్రితం అనగా మార్చి 7 వ తేదీన సరిగ్గా వారి దేశంలో అంతే మందికి కరోనా టెస్టులు జరిపారు . అంటే అతి తక్కువ మందికి కరోనా పాజిటివా లేక నెగిటివా అని నిర్ధారించే టెస్ట్ జరపడం వల్ల చాలామంది ఈ టెస్టుని తప్పించుకొని కొన్ని వేల మందికి ఈ వైరస్ ను అంటించే ప్రమాదం ఉంది . కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఎక్కువ మెడికల్ కిట్లు తెప్పించి సాధ్యమైనంత ఎక్కువ మంది అనుమానితులకు టెస్టులు జరిపించటం మంచిది. అదీ కాకుండా భారత దేశంలో ప్రతి 1000 మందికి 0.7 బెడ్లు ఉండగా ఫ్రాన్స్లో ఈ సంఖ్య 6.5 గా ఉంది . ఇకపోతే ప్రతి 1000 మందికి గాను చైనాలో 4.2 , ఇటలీలో 3.4 , ఇంగ్లాండ్ లో 2.9 , అమెరికాలో 2.8 మరియు ఇరాన్ లో 1.5 బెడ్లు ఉన్నాయి . అక్కడే అంత మారణకాండ జరిగితే ఇక మన దేశంలో ఏ రకంగా జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాము .

Content above bottom navigation