చైనాలో మరో విషాదం… కుప్పకూలిన కరోనా హోటల్..

140

కరోనా వైరస్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న చైనా ఉలిక్కిపడేలా మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుల కోసం క్వారంటైన్ సెంటర్‌ గా ఏర్పాటుచేసిన ఐదంతస్తుల ఓ హోటల్‌ కుప్పకూలింది. ప్యుజియాన్‌ ప్రావిన్స్‌లోని క్వాంజౌ నగరంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి. దీంతో హోటళ్లు, ఇతర భవనాలను బాధితులకు వైద్య సేవల కోసం వినియోగిస్తున్నారు. ప్రైవేట్ భవనాలను కూడా క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సోకిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి, కోలుకున్న తర్వాత వారిని ఇంటికి పంపిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తికి గురైన ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలను వైద్య పరిశీలన కోసం ఉపయోగిస్తున్న జిన్జియా ఎక్స్‌ప్రెస్ హోటల్ కూలిపోయింది. శనివారం సాయంత్రం భవనం అకస్మాత్తుగా కూలి 71 మంది చిక్కుకున్నట్లు, అందులో నలుగురు మృతి చెందినట్లు అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 10:30 గంటల వరకు ముప్పై ఎనిమిది మందిని రక్షించారు, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, ఏడు రెస్క్యూ డాగ్లను ఈ ప్రదేశానికి పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ లైట్‌ లతో రెస్క్యూ కార్మికులను శిధిలాల మీదుగా ఎక్కించి ప్రజలను బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

హోటల్ కూలిన విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల్లో కొంత మంది 14 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకొని డిచ్ఛార్జ్‌ కు సిద్ధంగా ఉన్నారు. ఈలోగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకొని ఇతర క్వారంటైన్ భవనాల్లో ఉన్న కరోనా బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వాళ్లు (వైద్య సిబ్బంది) ప్రతి రోజూ నా నమూనాలు సేకరిస్తున్నారు. పరీక్షలన్నీ నార్మల్ అని వస్తున్నాయి. కానీ, ఇక్కడ నుంచి పంపించడంలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని ఐసోలేషన్‌లో ఉన్న ఓ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు బీజింగ్‌కు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రమాదానికి గురైన జిన్జియా ఎక్స్‌ప్రెస్ హోటల్ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని తీర నగరమైన క్వాన్‌జౌలో ఉంది. ఈ భవనం నిర్మాణం 2013 లో ప్రారంభమైంది.. దీనిని 2018 లో 80 గదుల హోటల్‌ గా మార్చినట్లు అధికారి జిన్‌హువాకు తెలిపారు. మొత్తం మీద తాజా ఘటనతో చైనా పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. చైనా ఈ వరుస విషాదాల నుంచి బయటపడాలని యావత్తు ప్రపంచం కోరుకుంటుంది.

Content above bottom navigation