జీవితాంతం నగ్నంగా ఉండే అమ్మవారు

శ్రీకృష్ణుడిని వరించిన మీరాబాయిలా,
శ్రీరంగనాధస్వామిని వరించిన గోదాదేవిలా,
శివుడునే తన పతిగా భావిస్తూ,
తన పుట్టుక మహేశ్వరుడికే అని, ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉండేది ఈ భ‌క్తురాలు
శ్రీశైల మల్లికార్జునస్వామిని భర్తగా భావించిన మహా భక్తురాలు అక్క మహాదేవి.
ఇక శ్రీశైల అడవుల్లో అక్కమహాదేవి గుహలో ఏర్పడిన సహజ శివలింగ దర్శనం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
మరి అక్క మహాదేవి ఎవరు? అక్కమహాదేవి ఎలా శివ భ‌క్తురాలిగా మారారు అనేది ఈ వీడియోలో చూద్దాం

అక్క మహాదేవి సాక్షాత్తు పార్వతీదేవి రూపము, మల్లికార్జునిడి యొక్క అనుగ్రహముతో జన్మించినది. ఈమె కర్ణాటక రాష్ట్రములోని ఉడుతడి గ్రామంలో సుమతి మరియు నిర్మలశెట్టి దంపతులకు జన్మించినది. సుమతి శైవభక్తురాలు ఆమె సంతానం కోసం శివుడిని ప్రార్థిదింపగా ఆయన అంశతో కూడిన ఒక ఆడపిల్లకు జన్మను ఇస్తావని వరాన్ని ఇస్తారు. మహేశ్వరుని అంశతో పుట్టిన పాపకు మహాదేవి అని నామకరణాన్ని చేసారు ఆ దంపతులు. అయితే మహాదేవి ఎంతో సౌందర్యరాశి, గుణవంతురాలు, పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన అమ్మాయిగా పెరగసాగింది. తన వయస్సుతో పాటుగానే బోళా శంకరణుని మీద ఇష్టాన్ని కూడా పెంచుకుంది ఆమె.. ప్రతిరోజూ పిల్లలకు పెద్దలకు శివపురాణము గురించి శివుడు పార్వతులగురించి వివరించే మహాదేవిని వారు అంతా అక్కమహాదేవిగా పిలిచేవారు. శివుడునినే తన పతిగా భావిస్తూ ప్రతిరోజూ ఆయన్ని వేడుకునేది.

Image result for అక్క మహాదేవి

ఆమెని చూస్తే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట.. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామపర్యటనకు వెళ్లాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చొన్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయింది. అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవు. అందుకని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుందట. ఆ పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో, తోచినంతసేపు ధ్యానించుకోవచ్చునన్నది ఆ షరతులలో ఒకటి.

అక్కమహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలానికి ఆమె షరతులను అతిక్రమించాడు. షరతుల ప్రకారం మహాదేవి నిత్యం శివుడిని పూజిస్తూ ఉండగా ఒక రోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరని లాగి నీవు మహాభక్తురాలవు కదా నీకు వస్త్రములతో పని ఏమి అని అని ప్రశ్నిస్తాడు. తన కేశాలనే వస్త్రముగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. అలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది.

ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తిబాటలో నడిపిస్తున్నారు. అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసేందుకు, తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది. మహాదేవి ఆ అనుభవ మండపాన్ని చేరుకుని… శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు, అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి వాదనాపటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బిరుదుని అందించారు. అలా మహాదేవి కాస్తా అక్కమహాదేవిగా మారింది.

అక్కమహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లవలసిందిగా సూచించాడట. దాంతో ఆమె ఎన్నో కష్టానికి ఓర్చి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. ఆనాడు శ్రీశైలం అంటే మాటలా.. ఎంతో ద‌ట్ట‌మైన‌ అడవులు, క్రూరమృగాలు, ఎడతెగని కొండలు, దారిదోపిడీగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిగా ఆమె వెళ్ల‌డం అంటే మాటలు కాదు. కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో, మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సుని సాగించారు. కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదళీవనంలో ఆ మల్లికార్జునిలో అంకితమైంది ఈ భ‌క్తురాలు

అక్కమహాదేవి మహాభక్తురాలే కాదు… గొప్ప రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400లకు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ప్రతి వచనంలోనూ చెన్న మల్లికార్జునా అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్కమహాదేవి రాసిన వచనాలుగా భావిస్తున్నారు…. ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన, ఈ ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే అర్థాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా భావిస్తారు.

అక్క‌మ‌హ‌దేవి ఆల‌యం గుహ‌లు ఎక్క‌డ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణించి కొండరాళ్ళపైకి దిగి వెళితే అక్క మహాదేవి గుహలకు చేరుకోవ‌చ్చు… ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంది. ఈ సొరంగం చివరలో శివలింగాకారంలో ఏర్పడిన శిలారూపం ఉంది. దీనినే సహజ శివలింగం అని అంటారు. అక్కమహాదేవి ఈ శివలింగాన్ని పూజించనది చెబుతారు.. అక్కమహాదేవి విగ్రహము ఇప్పటికి మల్లికార్జుని గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. ఇప్ప‌టికీ అక్క‌డ గుహ‌ల‌కు చాలా మంది వెళ్లి వ‌స్తారు.

Content above bottom navigation