జ్యోతిష్కుడు వేణుస్వామి వివాదాస్పద కామెంట్స్.. రాశి ఖన్నా, స్టార్ హీరో, యాంకర్ కు అలా జరుగుతుందంట..

113

మీకు వేణు స్వామి గుర్తున్నారా? అదేనండి ప్రముఖ జ్యోతిష్యుడు . సినిమా వాళ్ల, రాజకీయ నాయకుల భవిష్యత్ చెప్పే గొప్ప జ్యోతిష్యుడు ఈయన. యూట్యూబ్ లో ఈయనకు ఒక ఛానెల్ కూడా ఉంది. అందులో చాలామంది సెలెబ్రిటీల జాతకాలు చెబుతాడు. తాను చెప్పే 100 జాతాకాల్లో 90 ఖచ్చితంగా జరిగి తీరుతాయని చెప్తుంటారు. ఇవన్ని ఎవరో చెప్పిన మాటలు కాదండి అతనే స్వయంగా చెప్పారు. ఒక టివి ఛానెల్లో బాబుగోగినేనితో జరిగిన వివాదం తర్వాత కనిపించకుండాపోయిన వేణు స్వామి, మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు కొందరు సెలెబ్రిటీల జాతకాలు చెప్తున్నాడు .ఆ వివరాల్లోకి వెళ్తే..

సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఎలక్షన్స్ అప్పుడైతే వీటికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వాళ్లు చెప్పేది నిజమా కాదా , జరుగుతుందా జరగదా అని ఎవరూ ఆలోచించరు. ఎలక్షన్ రిజల్స్ట్ వచ్చాకా ఎవరూ పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఎలక్షన్స్ టైంలో, క్రికెట్ మ్యాచ్ లప్పుడు, సినిమాలకు సంబందించి జ్యోతిష్యాన్ని నమ్ముకునే వాళ్లు, నమ్మేవాళ్లు ఉంటారు. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించి వివాదస్పద వాఖ్యలు చేసి వేణు స్వామి ఫేమస్ అయ్యారు. మరికొద్ది రోజుల్లో ఉగాది రాబోతోంది. కొత్త సంవత్సరం తమకెలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఎవరికి ఎలా ఉంటుందో కానీ రాశి కన్నాకి మాత్రం సూపర్ గా ఉంటుందని జోస్యం చెప్పారు వేణు స్వామి. కొత్త ప్రాజెక్ట్స్ తో టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంటుందని అన్నారు. తను నటించే సినిమాలన్ని ఘనవిజయం సాధిస్తాయని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఒక స్టార్ హీరో తీవ్ర అనారోగ్యానికి గురౌతారని, ఒక యంగ్ పొలిటీషయన్ పెద్ద యాక్సిడెంట్ కి గురౌతారని పేర్లు చెప్పకుండా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పేర్లు చెప్పకుండా జాతకం చెప్పడం ఏంటి, దమ్ముంటే పేర్లు చెప్పాలని, నువ్వు చెప్పే జాతకం నిజం అవుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Image result for జ్యోతిష్కుడు వేణుస్వామి వివాదాస్పద కామెంట్స్..

ఒక తెలుగు టాప్ యాంకర్ వైవాహిక జీవితంలో వివాదాలు చోటుచేసుకుంటాయని, భర్త నుండి విడాకులు పొందుతుందని మరో కామెంట్ చేసారు వేణు స్వామి. వేణు స్వామి భార్య కూడా యాంకరే. ఆ యాంకర్ మీ ఆవిడే, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి జాతకాలు చెప్తే ఆవిడ వదిలేసి పోవడం ఖాయం అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పబ్లిసిటి కోసమే వేణుస్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని కొందరు మండిపడుతున్నారు.

Content above bottom navigation