టెక్నాలజీ అద్భుతం ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది
ఆమె కూతురు ఆమె కళ్ల ముందు లేకుండా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది
ఆమె గుర్తులు మాత్రమే వారి కుటుంబంలో ఉన్నాయి
ఆమె మనసులో మాత్రమే నిత్యం జ్యోతిలా కనిపిస్తూ ఉంది
కుతూరు లేదు అనే బాధ ఆ కుటుంబాన్ని ఆ తల్లిని వేదనకు గురిచేస్తోంది
కాని ఈ టెక్నాలజీ మాత్రం ఆమెకు ఆశలు చిగురించింది
ఆమె కూతురు భౌతికంగా దూరం అయినా, తనకు మరోసారి స్పష్టంగా దగ్గరగా వచ్చిన అనుభూతిని కలిగించింది
ఈ నవ టెక్నాలజీతో నయా ట్రెండ్ కు బాటలు చూపించింది

అవును ఏదైనా సరే టెక్నాలజీతో అద్భుతం చేయచ్చు అంటారు..ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నాలుగేళ్ల క్రితం ఓ వ్యాధితో మరణించిన తన ఏడేళ్ల కూతురిని ఓ తల్లి స్పృశించగలిగింది. వాల్డ్ ఆఫ్ వర్చ్యువల్ రియాల్టీ(వీ ఆర్) లో ఇదో మెస్మరైజింగ్ యాస్పెక్ట్ అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ కొరియాలో ఓ టీవీ డాక్యుమెంటరీని రూపొందించిన నిర్వాహకులు అసాధారణ టెక్నాలజీని ఉపయోగించారు. లక్షలాది మంది కొరియన్లు ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. వీఆర్ హెడ్ సెట్ ధరించిన జాంగ్ జీ అనే ఆ తల్లి తన కూతురిని తాకగలగడమే కాక.. ఆ చిన్నారి బర్త్ డే రోజున తాను మిస్సయిన బర్త్ డే కేక్ పైని గల క్యాండిల్స్ ని కూడా వెలిగించగలిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నయెన్ అనే ఆ చిన్నారి తాలూకు ఫోటోలను, వీడియోల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ నిర్వాహకులు 3 డీ ఇమేజీని రీక్రియేట్ చేయగలిగారట. ఇది ఆ తల్లికి మరపు రాని తీపి గుర్తుని కలిగించింది..
తన కూతురు దూరం అయిన బాధ ఆమె కళ్లల్లో కనిపించింది, ఇన్నేళ్లకు ఆమెని చూసిన ఆనందం వెలుగుగా మారింది.
అయితే ఈ శ్రమకు ఇందుకు వీరికి ఎనిమిది నెలల సమయం పట్టింది. మీటింగ్ యుపేరిట వారు ఈ షో నిర్మించారు. జాంగ్ జీ సంతోషానికి అవధుల్లేవు. మరణించిన తన కూతురిని నిజంగానే తాను సజీవంగా చూసినట్టు, తాకినట్టు అనుభూతి చెందింది ఆమె. టచ్ సెన్సిటివ్ గ్లోవ్స్, ఆడియోలను కూడా ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు ఉపయోగించారు. అయితే సౌత్ కొరియాలో అప్పుడే ఈ షో మీద కొందరు విమర్శలు లేవనెత్తారు. మరణించిన వారిని వారి తలిదండ్రులో, బంధువులో మళ్ళీ చూసినట్టు అనుభూతి చెందినా, వారిని తాకినట్టు ఫీలయినా వారి జ్ఞాపకాలు, స్మృతులు తిరిగి మానసికంగా వారిని వేధిస్తాయని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.
అయితే ఇలాంటి నవ ఆవిష్కరణలు వస్తే ఇలాగే అంటారు.. మన కు దూరం అయిన వారిని ఇలా చూస్తే ఆ బాధ కలిగినా మనం వారిని చూశాం అనే ఆనందం జీవితాంతం కలుగుతుంది.. ఆ ఆధ కొంతైనా మనం తగ్గించుకోగలం అంటున్నారు యువత, మరి ఈ ఆవిష్కరణపై మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
ఈ క్రింద వీడియో చూడండి: