ట్రంప్‌ విమానం 747-200బీ.. ఎగిరే వైట్‌హౌస్‌..లోపల ఏమేం ఉంటాయో తెలిస్తే షాకే..?

ట్రంప్ ఇండియా టూర్ ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ టూర్ లో ట్రంప్ కు సంబంధించిన అనేక విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఆయన దర్పం, రాజసం.. ఔరా అనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ ను ఇండియాకు మోసుకొచ్చిన.. ఇండియాలోనూ ట్రంప్ ను అనేక చోట్లకు తిప్పుతున్న ఆయన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా పిలిచే బోయింగ్‌ 747-200బీ సిరీస్‌ విమానం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విమానం ట్రంప్ ఇండియా టూర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ విమానం ప్రత్యేకతలు తెలుసుకుంటే మీరు ఔరా అనక తప్పదు. అమెరికా అంటేనే భూతల స్వర్గం. మరి ఆ దేశం అధ్యక్షుడి విమానం అంటే మామూలుగా ఉంటుందా.. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుకునే అమెరికా దేశాధ్యక్షుడి విమానాన్ని కూడా అత్యంత అధునాతనంగా, వైభవంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలో ఆ విమానం గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ విమానంలోనే వెళ్తారు. వేరే విమానం ఎక్కరు. దీన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ అని పిలుస్తారు. ఇది బోయింగ్‌ 747-200బీ సిరీస్‌ విమానం. విమానంపై ‘United States of America’ అక్షరాలు, అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్రతో ఉండే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ తనదైన ప్రత్యేకత చాటుతోంది. ఇక ఈ బోయింగ్‌ 747-200బీ సిరీస్‌ విమానం ప్రత్యేకత ఏంటంటే.. ఇది గాల్లోనే ఇంధనం నింపుకోగలుగుతుంది. అధ్యక్షుడు ఎక్కడికెళ్లాలంటే అక్కడకు తీసుకెళ్లే అపరిమిత రేంజ్‌ దీని సొంతం. అధునాతన సెక్యూర్‌ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ ఉంది. ఒకవేళ అమెరికాపై దాడులు జరిగితే.. ఆ సమయంలో ఈ విమానం మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌ గా కూడా పనిచేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది ఇందులో. ఇక విమానం లోపల 4000 చదరపు అడుగుల ఫ్లోర్‌ స్పేస్‌ ఉంటుంది. దీన్ని మూడు లెవల్స్‌గా విభజించారు. ఇందులో ఒకటి ఎక్స్‌టెన్సివ్‌ సూట్‌. ఇందులో అధ్యక్షుడి కోసం పెద్ద ఆఫీస్‌, కాన్ఫరెన్స్‌ గది, టాయిలెట్‌ ఉంటాయి. ఇక రెండోది మెడికల్‌ సూట్‌. ఇందులో ఓ డాక్టర్‌ శాశ్వతంగా ఉంటారు. అధునాతన సర్జరీ గది కూడా ఉంటుంది.

Image result for trump boeing 757

ఇక మూడోదాన్ని వంట కోసం కేటాయించారు. విమానంలోని రెండు వంటశాలల్లో 1000 మందికి సరిపడా వంట ఒకేసారి చేయవచ్చు. విమానంలో ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కూడా ఉంది. అధ్యక్షుడు, ప్రథమ మహిళ విశ్రాంతి కోసం ప్రత్యేకమైన క్వార్టర్లు ఉంటాయి. దీంతో పాటు అధ్యక్షుడితో కలిసి ప్రయాణించే సీనియర్‌ అడ్వైజర్లు, సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, ప్రెస్‌, ఇతర అతిథుల కోసం వేర్వేరుగా క్వార్టర్లు కూడా ఉన్నాయి. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇందులో మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు ఉన్నాయి.ఈ విమానం యొక్క రెక్కల పొడవు 195 అడుగులు కాగా టేకాఫ్ తీసుకునే సమయంలో విమానం మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఫ్లయింగ్ వైట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇంతటి విశిష్ఠత ఉన్న విమానంలో ట్రంప్ ఇండియాకు వచ్చారు.

Content above bottom navigation