ట్రైన్ మైలేజి ఎంత..ట్రైన్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా..

182

మన ఇండియాలో రైళ్లది కీలకపాత్ర అనే చెప్పుకోవాలి. అసలు ట్రైన్ లేని ఇండియాను ఊహించుకోవడమే కష్టం.ప్రతిరోజు రెండు కోట్లకు పైగా జనం ట్రైన్స్ లలో ప్రయాణిస్తూ ఉంటారు.అలాంటి ట్రైన్ కు ఇంజన్ గుండెకాయలాంటిది అని చెప్పుకోవచ్చు.ఇంజన్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని అందరికి తెలుసు.అయితే రైలు గురించి రైలు ఇంజన్ కు సంబంధించిన విషయాల గురించి మీకు ఏమైనా తెలుసా..ఏమి తెలీదు కదా..అయితే ఇప్పుడు చెబుతా వినండి.

1962 వరకు డీజిల్ ఇంజన్స్ ను అమెరికాకు చెందిన అమెరికన్ లోకో కంపెనీ అమెరికాలో తయారుచేసి ఇండియాకు పంపేవారు. అయితే 1964 నుంచి మన ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఇప్పటివరకు 2700 లకు పైగా డీజిల్ ఇంజన్స్ ను తయారుచేశారు. దీని పూర్తీ బరువు లక్ష 12 వేల 8 వందల కిలోలు. దీని టాప్ స్పీడ్ 120 kmph. దీని పవర్ అవుట్ ఫుట్ ఎంత అంటే.. ప్యాసింజర్లు ప్రయాణించే ట్రైన్ అయితే 4500 పవర్స్ ఫర్ హావర్. గూడ్స్ ట్రైన్ అయితే 5000 హావర్స్ పవర్ ఉంటుంది. ట్రైన్ సిసి ఇంజన్ కెపాసిటీ లక్ష నుంచి లక్ష యాభై వేల సిసి మధ్యలో ఉంటుంది. ఇక మైలేజి విషయానికి వస్తే….మనం సాధారణంగా ఒక లీటర్ కు ఎంత మైలేజి ఇస్తుంది అని అంటాం. అయితే ట్రైన్ విషయంలో ఒక కిమీకు ఎన్ని లీటర్లు ఖర్చు అవుతుంది అనుకోవడం బెటర్. ప్రతి కిమీ కు 4 నుంచి 5 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది. ఒకవేళ టాప్ స్పీడ్ లో ఉంటె 9 నుంచి 11 లీటర్లు ఖర్చు అవుతుంది. ప్రతి 3000 వేల కిమీ కు సర్వీసింగ్ అవసరం. కరెక్ట్ గా సర్వీసింగ్ చేస్తే 35 ఏళ్ళు పనిచేస్తుంది.

Image result for ట్రైన్ మైలేజి ఎంత

ఇక దీని రేట్ విషయానికి వస్తే… ప్రతి ఇంజన్ తయారీకి 13 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే దారి మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారో తెలుసా.. ప్రతి లోకో ఫైలెట్ కు రెండేళ్లు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో పాస్ అయితేనే ట్రైన్ నడపడానికి పాస్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లోనే ఇంజన్ కు సంబందించిన పూర్తీ వివరాలతో పాటు మధ్యలో రిపేర్ వస్తే ఎలా రిపేర్ చెయ్యాలో పూర్తీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ లోకో ఫైలెట్స్ రిపేర్ వస్తే దానిని గుర్తించి బాగుచేస్తారు. ఒక్కొక్కసారి ట్రైన్ ఆపినా కూడా ఇంజన్ ను ఎందుకు ఆపరో తెలుసా.. ట్రైన్ ఆగడం మొత్తం ఎయిర్ బ్రిక్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ఎయిర్ బ్రిక్స్ కు గాలి తగ్గకుండా ఎప్పటికప్పుడు గాలిని పంప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇంజన్ ను ఆపేస్తే కొద్దికొద్దిగా ఎయిర్ రీలీజ్ అయ్యి బ్రేక్స్ పూర్తీగా పనిచేయడం ఆగిపోతుంది. ట్రైన్ ముందుకు లేదా వెనక్కి వెళ్లి ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఈ ఇంజన్ ను ఆపరు. ఒకవేళ ఇంజన్ ను ఆపి మళ్ళి స్టార్ట్ చెయ్యాలంటే దాదాపు 20 నిముషాలు పడుతుంది. అందుకే సర్వీసింగ్ కు ఇచ్చినప్పుడు లేదా ఇతర బోగీలకు అటాచ్ చేసేటప్పుడు మాత్రమే ఇంజన్ ను ఆపేస్తారు.

Content above bottom navigation