తండ్రి చివరిచూపుకు వస్తున్న అమృత… అంగీకరించని తల్లి

114

తెలంగాణ రాష్టంలో 2018 సెప్టెంబర్ 14 న జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఎంత కలకాలం స్పృష్టించిందో మనకు తెలుసు. వేరే కులం వాడిని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని, కక్ష్య గట్టి కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే స్పృష్టించింది. ఆ తర్వాత పోలీసులు మారుతీరావు అండ్ టీమ్ ను పట్టుకుని జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యి బయటకు వచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు ఈకేసులో ప్రధాన నిందితుడు అయినా మారుతీరావు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇది హత్యనా? లేక ఆత్మహత్యనా పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకున్న రూమ్ లో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. దాంతో ఇది ఒక మిస్టరీ కేసుగా మారింది.

ఇక నిన్న సాయంత్రం మారుతీరావు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ లో ఆయన విషం సేవించడం వల్లే చనిపోయారని ప్రిలిమినరీ రిపోర్టులో తేలింది. పోస్ట్ మార్టం తర్వాత నిన్న రాత్రి మిర్యాలగూడకు ఆయన మృతదేహాన్ని తరలించారు. ఈరోజు మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ అంత్యక్రియలకు ఆయన కూతురు అమృత వస్తుందా లేదా అనే పెద్ద సస్పెన్స్ గా మారింది. కానీ తండ్రి మారుతీరావును చూసేందుకు వెళ్లాలని అమృత నిర్ణయం తీసుకుంది. తన తండ్రిని కడసారిగా చూడటానికి వెళ్లాలని పోలీసుల భద్రత కోరింది. కానీ ఆమెను తమ ఇంటికి రానిచ్చేది లేదని మారుతీ రావు భార్య గిరిజ, తమ్ముడు శ్రవణ్ తేల్చి చెప్పారు. ఆమె రావాలనుకున్న మేము రానివ్వం, చనిపోయే వరకు కూడా కూతురి కోసమే ఆయన పరితపించాడు. అమృత కోసం ఆయన ఎంతాగానమో తహతహలాడాడు. కానీ అవేమి అమృత పట్టించుకోలేదు. మా ఆయన బతికున్నప్పుడు ఇంటికి రమ్మని చాలాసార్లు కబురు పంపించాం కానీ ఎన్నడూ కూడా ఈ ఇంటి చుట్టుపక్కలకు రావడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు మనిషి పోయాకా వస్తా అంటే మేము ఎలా రానిస్తాం అని అమృత తల్లి గిరిజా అంటుంది.

Maruthi Rao

ఇలా అమృత కుటుంబ సభ్యులు రానివ్వం అని అంటున్న కూడా అమృత వెళ్ళడానికి నిర్ణయించుకుంది. దానికోసం పోలీసుల భద్రతా కోరుతుంది. దాంతో పోలీసులు ఆమెకు భద్రతా కల్పించడానికి ఒప్పుకున్నారు.. ఒకవేళ అమృత వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇదిలా ఉంటే ఉదయం కాసేపట్లో మారుతీరావు అంతిమయాత్ర మొదలు కానుంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. మారుతీరావు పోలీసులు అంతిమ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమృత అత్తింటి దగ్గర భారీ భదత్ర కల్పించారు. తమ్ముడు శ్రవణ్ అన్న మారుతీరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Content above bottom navigation