తిరుమలలో మరో అద్భుతం…. వెలుగులోకి బంగారు బావి

60

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమల పుణ్యక్షేత్రం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంటుంది. తిరుమలలో ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో చాలా వరకు తిరుమల మూలవిరాట్ కొలువైన గుడికి చుట్టుపక్కలే ఉన్నాయి. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది బంగారు బావి.

తిరుమల దేవాలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించక ముందు రంగదాసు అనే వ్యక్తి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని పూజించేవాడు. శ్రీ వెంకటేశ్వరుడుని పూజించడం కోసం రంగదాసు రెండు బావులను నిర్మించాడు. అందులో ఒకదానికి శ్రీ తీర్ధం అని, రెండో దానికి భూతీర్ధం అని పేరు పెట్టారు. రంగదాసు కాలానంతరం ఆ బావులు వాడుకలో లేవు. రంగదాసు వేంకటేశ్వర స్వామికి చేసిన విశేషమైన సేవల ఫలితంగా తరువాత కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మిస్తాడు. తొండమాన్ చక్రవర్తిని తనకు ఆలయం నిర్మించి శిఖరంపై బంగారు విమానాన్ని ఏర్పాటు చేయమని చెప్తాడు. అలాగే ఆలయ ప్రాంగణంలో పూర్వజన్మలో నిర్మించిన శ్రీ తీర్ధం, భూ తీర్థాలను మళ్ళీ పునరుద్దరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఈ శ్రీ తీర్థాన్ని పునరుద్దరించేలా చెయ్యమని శ్రీవారిని కోరుకుంటుంది. అందుకే శ్రీవారు తొండమాన్ చక్రవర్తికి ఈ బావులను పునరుద్దరించమని చెప్తాడు. శ్రీ వెంకటేశ్వరుని కోరిక మేరకు తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన తరువాత, వకుళా దేవి ఆలయంకు దగ్గరలో వంటశాలకు వెళ్ళే దారిలో ఈ బంగారు బావి ఉంటుంది. అలాగే భూతీర్థాన్ని దిగుడుబావి మెట్లతో నిర్మించినాడు. అదే పూలబావిగా ప్రసిద్దిపొందింది. భూతీర్ధంలోని నీటిని స్వామివారి పూల మొక్కల కోసం వినియోగిస్తారట.

Image result for బంగారు బావి

శ్రీవారి అభిషేకానికి ఈ బంగారు బావి నీళ్లు ఉపయోగిస్తారు. 11 వ శతాబ్దంలో శ్రీవారి అభిషేకానికి తిరుమలనంబి పాపవినాశన తీర్ధం నుండి రోజూ పవిత్ర జలాన్ని తెచ్చేవారు. అయితే ఒకసారి తిరుమలనంబి గురువు గారైన యామనాచార్యుల వారు తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారంట. ఆ సమయంలో ఎడతెరిపిలేని కుంభవృష్టి వచ్చిందంట. దాంతో పాపవినాశనం నుండి అభిషేక జలం తీసుకురావడానికి ఆటంకం ఏర్పడింది. అప్పుడు శ్రీస్వామి వారి అభిషేకానికి ఎలాంటి విఘ్నం కలగకుండా ఉండటానికి శ్రీ మహాలక్ష్మిని ఇలా ప్రార్ధించారట. శ్రీనివాసుని అభిషేకానికి ఇతర తీర్ధముల కంటే నీ కోరిక మేర వెలసిన ఈ శ్రీ తీర్థ జలం ఉత్తమం అని మేము భావిస్తున్నాం. అందుకే ఈ తీర్థ జలంతో అభిషేకం చేస్తున్నాం అని కోరి శ్రీవారికి అభిషేకం చేశారంట. అప్పుడు అక్కడ ఏర్పడిన కుంభవృష్టి తగ్గిపోయిందంట. అప్పటినుంచి స్వామివారికి ఈ శ్రీ తీర్థం జలంతోనే అభిషేకం చేస్తున్నారు. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడుతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. ఎప్పుడో నిర్మించిన బంగారు బావి, భూతీర్ధంలో నీళ్ళు ఇప్పటికీ ఇంకా ఉండటం విశేషం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation