తిరుమలలో శ్రీవారి పాదాల కింద నది ప్రవహిస్తుందా? సైంటిస్టులు చెప్పిన సంచలన నిజాలు

75

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమల పుణ్యక్షేత్రం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంటుంది. తిరుమలలో ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో చాలా వరకు తిరుమల మూలవిరాట్ కొలువైన గుడికి చుట్టుపక్కలే ఉన్నాయి. అయితే తిరుమలలో అంతర్గతంగా ఒక నది ప్రవహిస్తుందని మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలీదు. ఆ నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శేషాచలం కొండలుగా పేరు పొందిన తిరుమలలో అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తీర్థాలను మనం దర్శించుకోగలం. కానీ కొన్ని తీర్థాలు నేటికీ గుప్తంగానే ఉన్నాయి. మహర్షులు, దేవతలు ప్రతి రోజు ఈ పుణ్య తీర్థాలను దర్శిస్తుంటారని భక్తుల విశ్వాసం. ఈ గుప్త తీర్థాలలో ముఖ్యమైనది విరజా నది. ఈ నది దేవగంగా స్వరూపంగా మన పురాణాల్లో వివరించబడింది. మనుషుల జీవన విధానమే నదులతో అనుసంధానం అయ్యి ఉంది. భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతి నది అంతర్వాహిని అని మనకు తెలుసు. అలాంటి అంతర్వాహిని నదే మన తిరుమలలో ఉందని డెహ్రాడూన్ కు చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్దారించింది. ఈ శాటిలైట్ తీసిన ఫోటోలలో ఈ విరజానది ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. తిరుమలలో ఉన్న సమస్త నదులకు ఈ విరజానదే మూలకారణం. అంతేకాదు ఇప్పటికి కూడా ఈ నది తిరుమల గిరులలో ప్రవహిస్తూ ఆ శ్రీనివాసుడి పాదాలకు ప్రదక్షణ చేసి శ్రీవారి సన్నిధికి పక్కన ఉన్న పుష్కరణిలో కలుస్తున్నట్టు మన ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

Image result for viraja river

నిజానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రాంతంలో పూర్వం విరజానది ప్రవహిస్తూ ఉండేది. ఈ నదిపైనే ఆ వేంకటేశ్వరుడు పద్మ పీఠంపై వెలిశాడని ఆలయ చరిత్ర తెలియజేస్తుంది. అత్యంత పవిత్రమైన, ఎత్తైన ఈ తిరుమల గిరుల్లో ఇప్పటికి పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బావులను చుస్తే, ఆ విరజానది ఇప్పటికి కూడా అంతర్వాహిని అయ్యి ప్రవహిస్తుందని నమ్మాల్సిందే. విరాజనాది ఇప్పటికి కూడా అక్కడ ప్రవహిస్తుందని తెలియజేసే ఆనవాళ్లు శ్రీవారి ఆలయంలో ఉన్నాయంట. సంపంగి ప్రాగారంలో కల ఉగ్రాణం దగ్గర ఉన్న ఒక చిన్న తొట్టెలో ఈ విరజానదిని మనం సందర్శించవచ్చు. అంతేకాదు గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత అప్పుడప్పుడు ఊట కారుతుందంట. గర్బాలయంలోకి అలా వచ్చిన నీటిని అర్చకులు బయటకు తోడేస్తుంటారు. శ్రీవారి సమీపంలో ఉన్నప్పుడు నీటి గలగలలు, అలల ప్రవాహ శబ్దం వినిపిస్తోందనిఅర్చకులు చెబుతారు. 1964 సంవత్సరం ముందు వరకు శ్రీవారి గర్భాలయం నుంచి విరజానది నీరు పెద్ద ఎత్తున బయటకు వచ్చేదంట. అయితే అదే సంవత్సరం శ్రీవారి ఆలయానికి మహా సంప్రోక్షణ చేసినప్పుడు ఆలయ అర్చకులు ఆ నీటిని బయటకు రానివ్వకుండా ప్రత్యేకమైన బండరాళ్లతో గర్భాలయంలో మూసివేశారు. దీంతో ఈ నది నైరుతి వైపునున్న ఉగ్రాణం వైపుకు ఒక్కసారిగా వెల్లువెత్తింది. ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపునున్న చక్రతీర్థం నుంచి అంతర్వాహినిగా వస్తూ, శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షణ చేసుకుని ఆలయానికి ఈశాన్యంలో ఉన్న పుష్కరిణిలో కలుస్తుంది. చిత్తూర్ జిల్లాలోకి కేంద్ర ప్రభుత్వ నదుల సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తుందని నిర్దారించింది. ఈ సర్వేలను పరిశీలించిన అధికారులు మన పురాణాల్లో తెలిపినట్టే ఒక పెద్ద అంతర్వాహిని నది ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న నారాయణ పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వచ్చినట్టు నిర్దారించుకున్నారు. ఈ ప్రవాహాలు పురాణాల్లో తెలిపిన విరజానది కావచ్చని భావిస్తున్నారు సైంటిస్టులు. ఈ విధంగా తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ పుష్కరిణిలోకి చేరి భక్తులను పునీతం చేస్తుంది దేవగంగా స్వరూపం అయినా విరజానది.

Content above bottom navigation