తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు.. 16కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

135

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది… చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా.. ఇత‌ర‌ దేశాల నుంచి ఎవ‌రు వ‌చ్చినా వెంట‌నే వారు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు మీ వివ‌రాలు ఇవ్వాలి అని తెలిపారు. అంతేకాదు ప‌క్క రాష్ట్రాల నుంచి కొత్త‌గా ఎవ‌రు వ‌చ్చినా వారికి చెకింగ్ చేసి తెలంగాణ‌లోకి అనుమతి ఇస్తాము అన్నారు.

ఇలా మున్సిప‌ల్ ,పంచాయ‌తీ అధికారులు, పోలీసులు, వైద్య అధికారులు, అంద‌రూ కూడా పెద్ద ఎత్తున ఎవ‌రైనా క‌రోనా అనుమానితులు ఉంటే వారిని గుర్తించాలి అని తెలిపారు….బుధవారం 18 మార్చి ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా 19 మార్చి మరో మూడు కేసులు పాజిటివ్ అని తేలాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లేటెస్ట్‌గా నిర్ధారణ అయిన మూడు కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. తెలంగాణలో మొన్నటి వరకు కేవలం ఐదు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి..ఈరోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారే. ముగ్గురిలో ఒకరు దుబాయ్ నుంచి ఈనెల 14న హైదరాబాద్ వచ్చారు. మిగిలిన ఇద్దరు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇలా కరోనా బాధితులు వచ్చిన విమానాల్లో ప్రయాణికుల వివరాలను కూడా సేకరిస్తున్నారు అధికారులు.

Image result for telangana corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది అనే వార్త జ‌నాల‌కి భ‌యం క‌లిగిస్తోంది, అందుకే ఏదైనా అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు పంపిస్తున్నారు.. దుబాయ్ నుంచి ఈ నెల 14న నగరానికి వచ్చిన 50 ఏళ్ల వ్యాపారిలో 17న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆయనను కలిసిన వారిని కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. విమానంలో అతడితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వారికి కూడా చికిత్స అందించేందుకు వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతున్నారు

లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులకు వైరస్ సోకింది. వీరిద్దరినీ నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి బ‌య‌ట
ప్రాంతాల నుంచి ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారికి మాత్ర‌మే ఈ క‌రోనా సోకింది.. ఇక్క‌డ తెలంగాణ‌లో ఉన్న వారికి లేదు అని తేలుతోంది, అందుకే స్వ‌యంగా ఎవ‌రైతే మార్చి నెల 1 నుంచి భార‌త్ కు ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చారో .. వారు త‌ప్ప‌కుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటున్నారు అధికారులు.

Content above bottom navigation