తెలంగాణాలో లాక్ డౌన్ లో కొత్త రూల్స్…

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 650 వందల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 13 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా ప్రకటించింది.దేశవ్యాప్తంగా మొత్తం 72 జిల్లాలలో కూడా ఈ నెల 31 వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ని ప్రకటించారు. అయితే ఈ లాక్ డౌన్ కి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదు. జనాలు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే తెలంగాణా ప్రజలు చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ రూల్స్ ను పాటిస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు కొడతారేమో అనే భయం గుప్పిట్లో ఇంట్లోనే బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం.

సరుకుల కొనుగోళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరచి ఉంటాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి వెల్లడించారు. మెడికల్‌ షాపులు రోజంతా అందుబాటులో ఉంటాయని చెప్పారు. సీఎం కెసిఆర్ సమక్షంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు జన సంచారం పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కలెకర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడారు. ‘ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఎద్దఎత్తున గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలి. ఇంటికి అవసరమైన సరుకులను తమ ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రాంతం నుంచే తీసుకువెళ్లాలి. కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఒకే వ్యక్తి తీసుకువెళ్లాలి. నిత్యావసర సరుకుల కొరత, లాక్‌డౌన్‌ అమలు విషయంలో సమస్యలపై 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. విదేశీయుల కదలికల సమాచారం, వైద్య చికిత్సలకు సంబంధించిన అంశాలపై 104 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి’ అని సీఎస్‌ తెలిపారు.

Image result for తెలంగాణలో లాక్ డౌన్

నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలతో పాటు సరుకు రవాణా వాహనాలను ఆపవద్దని డీజీపీ సవాంగ్‌ కోరారు. ‘విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే సమాచారం సేకరించడం ముఖ్యం. వారి కదలికలపై పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖలు కలిసి పనిచేయాలి’ అని డీజీపీ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలు గుర్తించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షించాలనీ, ఉందని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సూచించారు. రేపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా 15 నిమిషాల్లో పరీక్షించి వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నదీ లేనిదీ గుర్తించవచ్చన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. కరోనాకు పాజిటివ్‌గా నిర్థారణ జరిగిన వారిలో 80 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స అవసరమే ఉండదన్నారు. కేవలం 15 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమన్నారు. వీరిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డుల్లో చికిత్స అందించవచ్చన్నారు. మరో 5 శాతం మందికి క్రిటికల్‌ కేర్‌ అవసరమని, వీరికి చికిత్స అందించేందుకు నిమ్స్‌తో పాటు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు.

Image result for తెలంగాణలో లాక్ డౌన్

ఇక కరోనాపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికా, ఇటలీలో వేల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతుండటంతో ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలను పూర్తిగా కట్టడి చేయడానికి గాను ఎమర్జెన్సి ని ప్రకటించే యోచనలో మోడీ సర్కార్ ఉంది. ప్రజలు బయటకు వస్తే లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి సిద్దమవుతుంది. అవసరం అనుకుంటే దీనిపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లాక్ డౌన్ వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా విస్తరించుకుంటూపోవడంతో సిటీలోనే జనాలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాసాలు పడుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చాలామంది విద్యార్థులు బయలుదేరారు.. పొందుగుల బ్రిడ్జి వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు. రాత్రి 12గంటల నుంచి పడిగాపులు కాస్తున్నా కూడా ట్రాఫిక్ తగ్గడం లేదు.. లాక్ డౌన్ ఉన్నా కూడా బయటకు రావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసులతో విద్యార్థుల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . తాగేందుకు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న విద్యార్థులు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రైళ్లల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ట్రైన్-18(ఇండియా మొదటి బుల్లెట్ రైలు) రూపకర్తలు ఇందుకోసం పనిచేయనున్నారు.

Content above bottom navigation