త‌ల్లి గ‌ర్భంలో శిశువు ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో ఎందుకు తంతుందో తెలుసా..?

171

మాతృత్వం అనేది నిజంగా మ‌హిళ‌ల‌కు ఒక గొప్ప వ‌రం. పెళ్ల‌యిన మ‌హిళ‌లు త‌ల్లి కావాల‌ని క‌ల‌లు కంటారు. ఆ భాగ్యాన్ని ద‌క్కించుకుంటారు. శిశువు క‌డుపులో ప‌డ‌గానే వారికి క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఉండే కుటుంబ స‌భ్యులు, స్నేహితులు గ‌ర్భిణీల‌కు కావ‌ల్సిన పౌష్టికాహారాలను తెచ్చి పెడుతుంటారు. ఇక శిశువు జ‌న్మించాక త‌ల్లికి క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే శిశువు త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో తంతుంది. ఆ అనుభూతిని కేవ‌లం గ‌ర్భిణీలు మాత్ర‌మే పొంద‌గ‌ల‌రు. మ‌రి నిజానికి అస‌లు శిశువు అలా త‌ల్లి క‌డుపులో ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో ఎందుకు తంతుందో తెలుసా..? ఆ విష‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for త‌ల్లి గ‌ర్భంలో శిశువు ఉన్న‌ప్పుడు కాళ్ల‌తో ఎందుకు తంతుందో తెలుసా..?

త‌ల్లి గ‌ర్భంలో ఉన్న శిశువు తంతుంది అంటే.. ఆ శిశువు ఆరోగ్యంగా పెరుగుతున్న‌ట్టు లెక్క‌. శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది అన‌డానికి సంకేత‌మే అది. క‌నుక‌నే శిశువు తంతుంది అంటే మ‌నం ఆ శిశువు ఆరోగ్యంగా ఉంద‌ని తెలుసుకోవాలి. దీంతోపాటు బ‌య‌టి వాతావ‌ర‌ణానికి కూడా క‌డుపులో ఉండే శిశువులు స్పందిస్తారు. బ‌యటి నుంచి ఏవైనా శ‌బ్దాల‌ను వింటే వారు త‌ల్లి క‌డుపులో తంతారు. ఇక త‌ల్లి ఎడ‌మ వైపున‌కు ప‌డుకున్న‌ప్పుడు శిశువులు ఎక్కువ‌గా త‌న్నుతారు. ఎందుకంటే ఆ వైపుకు త‌ల్లి ప‌డుకుంటే ర‌క్త స‌ర‌ఫరా శిశువుకు బాగా జ‌రుగుతుంది. దీంతో శిశువు యాక్టివ్ అయి తంతుంది. త‌ల్లి భోజ‌నం చేసిన త‌రువాత కూడా శిశువులు గ‌ర్భంలో తంతారు.

సాధార‌ణంగా ఏ త‌ల్లికి మొద‌టి సారి ప్రెగ్నెన్సీ వ‌స్తే, కడుపులో ఉన్న పిండం శిశువు అయినా 9 వారాల త‌రువాత త‌న్న‌డం స్టార్ట్ చేస్తుంది. రెండో సారి ప్రెగ్నెన్సీలో శిశువులు 13 వారాల త‌రువాత తంతారు. అయితే శిశువు త‌న్న‌డం లేదు.. అంటే.. శిశువు ఆరోగ్యంగా పెరగ‌డం లేద‌ని తెలుసుకోవాలి. ఈ క్ర‌మంలో త‌గిన టెస్ట్‌లు చేయించుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.

అయితే 36 వారాల త‌రువాత శిశువు త‌న్న‌డం కొద్దిగా త‌గ్గుతుంది. కానీ ఇలా జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే. అందుకు భ‌య ప‌డాల్సిన ప‌నిలేదు. ఇవీ.. గ‌ర్భంలో ఉన్న శిశువులు త‌న్న‌డానికి గ‌ల కార‌ణాలు..ఇక కడుపులో ఉన్న బిడ్డ మీరు మాట్లాడే మాటలు కూడా వింటారని మీకు తెలుసా.. పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాషను అర్ధం చేసుకోవడం జరుగుతుంది. అయితే 8వ నెల నిండిన తర్వాత పూర్తి ఆకారం సంతరించుకున్న తర్వాతే ఇది సాధ్యపడుతుంది.

Content above bottom navigation