దిశా నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టు కీలక సూచన

51

హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత యావత్తు భారతావని కదిలింది. మళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదని, నిందితులకు కఠినంగా శిక్షించాలని అందరు కోరుకున్నారు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ జరగడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మళ్ళి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ దిశా కేసు ఇప్పటికి కూడా ఇంకా కోర్ట్ లో నడుస్తూనే ఉంది.

నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ వారి కుటుంబాలు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదే విధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. అయితే, ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పందించారు. ఈ కేసులో ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి ఈ సమయంలో పిటిషన్‌ను విచారించలేమని పేర్కొన్నారు. ఆ న్యాయ కమిషన్ విచారణ జరిపి పూర్తి నివేదిక వచ్చే వరకూ విచారణ జరపబోమని స్పష్టం చేశారు.

Image result for దిశా నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టు కీలక సూచన

అయితే, న్యాయ విచారణ కమిషన్‌ సభ్యులను కలిసే అవకాశం పిటిషనర్లకు ఇస్తున్నట్లు సీజేఐ చెప్పారు. పిటిషనర్లు ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు వివరించుకోవచ్చని సూచించారు. ఒకవేళ న్యాయ కమిషన్ వల్ల న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ తెలిపారు. సీజేఐ సూచనతో న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గతేడాది నవంబరు నెలాఖరులో వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు కామాంధులు అత్యాచారం చేసి, పెట్రోలు పోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా తక్షణం శిక్షించాలంటూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గళాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఘటన జరిగిన కొద్ది రోజులకు నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. సీన్ రీక్రియేట్ చేస్తుండగా వారు తమపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అందుకే నలుగురిని ఎన్ కౌంటర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

Content above bottom navigation