మన దేశంలో అత్యంత దారుణమైన శిక్షగా ఉరిశిక్షని చెబుతాం
ఎవరికి అయినా ప్రాణాపాయం తలపెట్టినా ,మర్డర్ స్కెచ్ వేసినా ఎవరిని అయినా చంపినా
ఉరిశిక్ష అనేది అమలు అవుతుంది… దీనిని మన దేశంలో లాలో కూడా పొందుపరిచారు.
నిర్భయ కేసులో నలుగురికి ఉరి పడడంతో ఇప్పుడు ఉరిశిక్షలపై మళ్లీ చర్చ మొదలైంది.
అసలు భారత రాజ్యాంగం ఉరిశిక్ష గురించి ఏం చెప్పింది.
దేశంలో ఇప్పటివరకు ఎంతమందికి ఉరి అమలైంది .
30 ఏళ్లలో దేశంలో ఎన్ని ఉరిశిక్షలు అమలయ్యాయనేది చూద్దాం.
దేశ రాజ్యాంగంలో పౌరులందరికీ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది. అయితే మాన ప్రాణాలు తీస్తే నేరం నిరూపితమైతే ఉరిశిక్ష విధిస్తారు. ఒక వ్యక్తిని హత్య చేసినా.. హత్యకి కుట్ర పన్నినట్టు తేలినా ఉరిశిక్ష విధిస్తారు. ఇలా మన దేశంలో కొన్ని వందల కేసులు కోర్టు వరకూ వచ్చాయి, ముఖ్యంగా బీహర్ యూపీలో ఇలా ఉరిశిక్ష చాలా మందికి విధించారు, కొందరు రాష్ట్రపతి చేతిలో క్షమాబిక్ష పొంది బయట పడ్డారు, మరి కొందరు ఇలా ఉరికి బలి అయ్యారు.
1980లో సుప్రీం కోర్టు అత్యంత క్రూరమైన కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలని స్పష్టం చేసింది. జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ ఉరిశిక్షపై వెళ్లే హక్కునిచ్చింది. సుప్రీం తీర్పును సమీక్ష కోరే అవకాశం కల్పించింది. గవర్నర్ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేయవచ్చు. అయితే సమీక్ష పిటీషన్ క్షమాభిక్ష పిటీషన్లు తిరస్కరిస్తే ఉరిశిక్ష అమలు అవుతుంది. రెండోసారి ఏ వ్యక్తి రాష్ట్రపతికి మళ్లీ క్షమాబిక్ష చేసే అవకాశం ఉందడు, తొలిసారి మాత్రమే ఆ వ్యక్తి కేసు విషయంలో క్షమాబిక్ష అవకాశం ఉంటుంది, ఆ సమయంలో పూర్తి ఆధారాలు సమర్పించి కోరాలి, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు.

దేశంలో మొదటి ఉరిశిక్ష మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు వేశారు. కుట్రదారుడు నారాయణ్ ఆప్టేకి కూడా విధించారు. తర్వాత 1989 జనవరిలో ఇందిరాగాంధీ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష వేశారు….1995లో తమిళనాడులో ఆటోశంకర్ ను ఉరితీశారు. 2004లో పదేళ్ల బాలికను హత్యచేసిన కేసులో ధనుంజయ్ చటర్జీని కోల్ కతాలో ఉరితీశారు. వీటి తర్వాత చాలా వరకూ ఉరి అమలు జరగలేదు. కాని ఉగ్రవాదుల చర్యల వల్ల మన దేశం ఎంతో శాంతి కోల్పోయింది.
2010లో ముంబై 26/11 దాడుల కేసులో ఉగ్రవాది కసబ్ ను ఉరితీశారు. 2013లో పార్లమెంట్ దాడి కుట్రదారు అప్ఝల్ గురును ఉరితీశారు. 2015లో 1993 ముంబై బాంబుపేలుళ్ల కుట్రదారుడు యాకుబ్ మెమెన్ ను ఉరితీశారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ రేపిస్టులకు ఉరితీశారు. ఏపీలో 1993లో చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నేరస్థులకు ఉరిశిక్ష పడ్డా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఇలా మన దేశంలో చెప్పుకోదగ్గ కేసుల్లో ఉరిశిక్ష ఇలా అమలు అయింది.