నిర్బయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం.. ఉరి తప్పించుకోడానికి ఎత్తుగడ

67

నిర్భ‌య‌దోషుల‌కు ఇప్ప‌టికే రెండు సార్లు ఉరిశిక్ష‌పై ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.రెండు సార్లు ఉరి నుంచి కోర్టు ద్వారా త‌ప్పించుకున్నారు.ఇక మార్చిలో వీరికి మూహూర్తం మ‌రోసారి పెట్టారు.మ‌ళ్లీ న్యాయ‌ప‌ర‌మైన అవ‌కాశాలు వినియోగించాల‌ని చూస్తున్నారు ఈ న‌లుగురు నిందితులు.నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో దోషి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 3 న ఉరి అమలుచేయనుండటంతో వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

రెండు రోజుల కిందటే వినయ్ శర్మ నిరాహార దీక్షకు చేపట్టినట్టు జైలు వర్గాలు కోర్టుకు తెలిపాయి. వినయ్ శర్మ ఆహారం తీసుకోవడంలేదని చెప్పడంతో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేసింది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు.గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీహార్ జైల్లోనే 2016 ఆగస్టు 24న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇనుప గ్రిల్స్‌కు వస్త్రంతో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన వినయ్ శర్మను సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. త‌ర్వాత అతడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేశారు. ఆత్మహత్యకు ముందు వినయ్ శర్మ మానసిక కుంగుబాటుకు వాడే ఔషధాలను అధిక మోతాదులో తీసుకున్నట్టు తేలింది.

ఈ క్రింది వీడియో చుడండి

నిర్బయ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ సింగ్ 2013 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తీహార్ జైల్లోనే అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఉరిశిక్ష వేసిన స‌మ‌యంలో దోషులు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌దు.. ఇది కూడా నేరంగా ప‌రిగ‌ణిస్తారు, అయితే చికిత్స తీసుకోవ‌డం కోసం ఆస్ప‌త్రికి వెళ్లి మ‌రోసారి ఉరితేదిని మార్చుకునే ఎత్తులు కూడా వీరు వేస్తున్నార‌ని తెలుస్తోంది, దీంతో వీరికి సెక్యూరిటీని మ‌రింత పెంచారు జైలు అధికారులు.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation