నిర్భయ లాయర్‌ ఎవరో తెలుసా? ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..

126

నిర్భయ దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ తల్లికి న్యాయం జరిగిందని, ఎట్టకేలకు నిర్భయ ఆత్మ శాంతించిందని యావత్తు భారతావని సంతోషిస్తుంది. ఆలస్యంగానైనా నిర్భయకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవీ పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఆమెతో పాటు ఆమె తరఫున వాదించిన న్యాయవాది సీమా కుష్‌వాహానీని కూడా ప్రశంసలతో ముంచెత్తాలి. ఈ కేసు గెలవడానికి సీమా పడిన ఇబ్బందులు ఎన్నో.. ఆ విషయాల గురించి ప్రస్తావిస్తే..

నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారిని ఉరికంబం ఎక్కించడంలో ఇద్దరు మహిళలు ఏడేళ్ల పోరాటం చేశారు. వీరిలో ఒకరు నిర్భయ తల్లి, కాగా మరొకరు నిర్భయ తరఫు లాయర్ సీమా సమృద్ధి. నిర్భయ కేసులో ఆమె తల్లిచేసిన పోరాటానికి లాయర్ సీమా అందజేసిన సహాయ సహకారాలు ఎనలేనివి. అంతేకాదు, ఆమెకు ఇదే తొలికేసు కావడం విశేషం. సివిల్ సర్వీసులకు సన్నద్ధమవుతోన్న సీమా.. సుప్రీంకోర్టులో న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తోంది. అత్యంత చురుకైన విద్యార్ధిగా గుర్తింపు తెచ్చుకున్న సీమా.. నిర్భయ కేసును ఓ సవాల్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా నిర్భయ కుటుంబం, తల్లితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించి కేసులో విజయం సాధించారు.

విచారణ సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై కూలంకుషంగా చర్చించి, దోషుల తరఫు లాయర్ వేసే ఎత్తులను చిత్తుచేస్తూ తార్కికంగా ముందుకెళ్లారు. శిక్ష నుంచి తప్పించుకోడానికి కింది కోర్టు నుంచి సుప్రీం వరకూ దోషులు చేసిన ప్రయత్నాలను భగ్నం చేస్తూ.. ప్రత్యర్ధి లాయర్‌కు చుక్కలు చూపించారు. తన వాదనలతో న్యాయమూర్తులను మెప్పించారు. దీంతో తొలిసారి నిర్భయ దోషులకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు 2013 సెప్టెంబరులో మరణదండన విధించింది.

Image result for నిర్భయ లాయర్‌

నిందితులకు శిక్ష పడిన తర్వాత షీమా మాట్లాడుతూ.. ‘దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి ఘోరం చోటుచేసుకోవడం దారుణం, నిర్భయను కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. దోషులకు శిక్ష పడడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా దోషులను రక్షించడానికి యత్నించిన న్యాయవాది ఏపీ సింగ్‌ గురించి స్పందించాలని కోరగా.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తికి అతడు అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ సింగ్‌ ఇటీవల పాటియాలా కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ దోషులపై సానుభూతి వ్యక్తం చేశారు. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదని, మీడియా ఒత్తిడి వల్ల ఇప్పటికే మూడుసార్లు మానసికంగా మృతిచెందారని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా నిర్భయకు న్యాయం జరిగేలా చుసిన సీమాను ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిందే.

Content above bottom navigation