దుర్మార్గానికి చీచత్వానికి కేరాఫ్ అడ్రస్
ఒంటరి అమ్మాయిపై దాడి చేసి నిస్సహురాలిగా మార్చి
ఆరుగురు పశువుల్లా ఆమెని అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు
మానవ మృగాలకంటే పెద్ద పేరుని – వీరికి బిరుదుగా ఇవ్వాలి.
ఎనిమిదేళ్ల పోరాటానికి? చివరగా నేడు ఉరి తీయబడ్డారు ఈ నలుగురు దుర్మార్గులు..
ఓ నలుగురిని 130 కోట్ల మంది చంపాలి అని కోరారు అంటే, వారెంత కర్కశులో అర్దం చేసుకోవచ్చు..
ఉరి అనివార్యం, ఇక బయటపడడం అసాధ్యం అని తేలిపోయాక, నలుగురు నిర్భయ దోషుల ప్రవర్తన మారిపోయింది. నిన్న మొన్నటిదాకా వారిలో అసలు భయంగానీ, నిరాశగానీ, పశ్చాత్తాపంగానీ కనబడలేదు. ఆఖరి రోజున వారు ఏకాంతంలోకి, నిశ్శబ్దంలోకి జారిపోయారు. ఎవరితోనూ మాట్లాడకుండా తమ గదుల్లో ఓ మూల కూర్చుండిపోయారు. ఓ రకమైన నిర్లిప్త వైఖరి వారి ముఖాల్లో కనిపించింది… ఇరవై నాలుగ్గంటలూ సీసీటీవీ కెమెరాల ద్వారా నలుగురేసి అధికారులు నిఘా పెట్టారు. చివరకు వారిని ఉరితీశారు,
మరి ఇంత దుర్మార్గం చేసిన ఆరుగురిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరోకరు మైనన్ అని బయటపడ్డాడు మరి ఈ నలులురు ఎంత దుర్మార్గులో తెలుసా వీరి నేర చరిత్ర చూస్తే షాక్ అవ్వాల్సిందే…
రామ్ సింగ్
2012 డిసెంబరు 16న బస్సును నడిపిన ప్రధాన నిందితుడు. 20 ఏళ్లకిందటే రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వచ్చి రవిదాస్ మురికివాడలో ఉండేవాడు. తాగి వచ్చి అక్కడ ఇరుగుపొరుగు వారితో తరుచూ గొడవ పడేవాడు. అయితే మరణం తప్పదని గ్రహించిన రామ్‌సింగ్ 2013 మార్చిలోనే జైలు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముఖేశ్ సింగ్
ఇతను రామ్‌సింగ్‌కు చిన్న తమ్ముడు. బస్సు నడిపినది తానేనని, అన్న కాదని, తాను రేప్ చేయలేదని అడ్డగోలుగా వాదించినా మిగిలిన దోషులు అది నిజం కాదని చెప్పడంతో ఏం చేయలేకపోయాడు. ఇతను కూడా దుర్మార్గుడు.
అక్షయ్ ఠాకూర్
నేరం జరిగిన రోజు ఢిల్లీలో లేనని, బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి అంతకు మందు రోజు అంటే డిసెంబరు 15నే వెళ్లిపోయానని వాదించాడు. నేరం చేసిననాటికి ఇతని వయసు 28 ఏళ్లు. పెళ్లయి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని నిందితులు అందరూ అతను కూడా ఉన్నాడు అని చెప్పారు.
పవన్ గుప్త
నిర్భయను, ఆమె స్నేహితుణ్ని ఇనుపరాడ్‌తో చితగ్గొట్టి, ఆమెను ఈడ్చుకొచ్చినది పవన్ గుప్తాయే. ఆ ఘోరం జరిగేనాటికి 19 ఏళ్ల వాడు… తాను చేయరాని మహాపాపం చేశానని పవన్ ఒప్పుకున్నాడు. ఇతనిని ఎలాగైనా ఉరినుంచి తప్పించే ఉద్దేశంతో మైనర్ అని నమ్మించే ప్రయత్నం జరిగింది. కాని కోర్టు నమ్మలేదు సాక్ష్యాలు లేవు..
వినయ్ శర్మ
ఇతను కూడా రవిదాస్ మురికివాడలో రామ్‌సింగ్ ఇంటి కి దగ్గర్లోనే ఉండేవాడు. రామ్‌సింగ్‌కు ఫ్రెండు. జిమ్‌లో శిక్షకుడిగా పనిచేసేవాడు. పాతికేళ్ల వయసు. ఆ బస్సులో తాను లేనని బుకాయించాడు. ఆ రోజు సాయంత్రం పవన్ గుప్తాతో కలిసి ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లానని కోర్టులో వాదించాడు. నిర్భయ, ఆమె స్నేహితుడి దగ్గర ఉన్న డబ్బు, బంగారం దొంగిలించి, అత్యాచారం చేసినవాడు వినయ్ శర్మ.
ఆరో దోషి (మైనర్)
అతి కిరాతకంగా నిర్భయను అత్యాచారం చేసి, చిత్రహింసల పాల్జేసిన ఓ వ్యక్తి…మైనర్ అన్న నెపంతో బతికి బయటపడ్డాడు. ఇతను రామ్‌సింగ్ దగ్గర క్లీనర్‌గా పనిచేసిన వ్యక్తి. అత్యాచార ఘటన జరిగిన రోజు రాత్రి నిర్భయ కడుపులో పేగులను పెకలించినట్లు వార్తాకథనాలు వచ్చాయి. మర్ సా.. అని బూతులు తిట్టి ఆమెను కుళ్లబొడిచిన కిరాతకుడు. అతన్ని విడిచిపెట్టడంపై దేశవ్యాప్త చర్చ జరిగింది. 18 కాదు 16 ఏళ్ల వరకే బాలనేరస్థుల గరిష్ట వయోపరిమితి ఉండాలన్న డిమాండ్లు వచ్చాయి. ఘటన జరిగేనాటికి అతని వయసు 17 ఏళ్ల 285 రోజులు. అంటే 18 ఏళ్ల కంటే తక్కువ కాబట్టి అతనిని బాలనేరస్థుల బోర్డు విచారణ జరిపింది. అతన్ని మూడేళ్ల తరువాత రహస్యంగా విడుదల చేసి పంపేశారు.
ఇంత దుర్మార్గం చేసిన వారిలో అతను ఒక్కడే బయటపడ్డాడు, కాని అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాత్రం ఎవరికి తెలియదు కుటుంబం అతన్నీ దూరంగా పంపించేసింది