నీ తండ్రి దగ్గరకు వెళ్ళు అని కోడలిని పంపించిన ప్రణయ్ తండ్రి ..అమృత ఏం చేసిందో తెలిస్తే షాక్..

67

2018 సెప్టెంబర్ 14 న మిర్యాల గూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఎంత కలకలం స్పృష్టించిందో అందరికి గుర్తుకుండే ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ప్రాణం తీసుకున్నాడు. నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మారుతీరావు ఆత్మహత్య విషయం తెలియగానే ప్రణయ్ తల్లిదండ్రులు అమృతను తండ్రిని చూసి రమ్మని పంపించారంట. కానీ అమృత వెళ్ళడానికి నిరాకరించండంట. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో మారుతీరావు, అమృతకు రాయబారం పంపినట్లు తెలిసింది. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు… ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Image result for ప్రణయ్ తల్లిదండ్రులు

ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మారుతీరావు చనిపోయాడని తెలియగానే ప్రణయ్ తల్లిదండ్రులు అమృతను వాళ్ళ ఇంటికి వెళ్లిరమ్మని చెప్పారంట. ఎన్ని తప్పులు చేసిన ఆయన నీ కన్నతండ్రి. ఒకసారి వెళ్లి కడసారి చూసుకొని రమ్మని చెప్పారంట. కానీ అమృత ఒప్పుకోలేదని సమాచారం. నా భర్తను చంపినా వ్యక్తి చనిపోతే నేను ఎలా వెళ్తాను. అయినా అతను నా తండ్రి కాదు, నా తండ్రి ఎప్పుడో చనిపోయాడు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. నేను వెళ్ళను అని చెప్పిందంట అమృత. ఇక మారుతిరావుకు ఈరోజు సాయంత్రం పోస్ట్ మార్టం చేసి, రాత్రికి మిర్యాలగూడను డెడ్ బాడీని తరలించనున్నారు. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Content above bottom navigation