నెలలో రెండు సార్లు ప్రసవించిన మహిళ, ఆశ్చర్యం లో డాక్టర్లు ప్ర‌పంచంలో వింత

78

వివాహం అయిన స్త్రీ క‌చ్చితంగా మాతృత్వం పొందాలని కోరుకుంటుంది.
ఈ స‌మ‌యంలో క‌వ‌ల‌లు పుట్టాలి అని కొంద‌రు కోరుకుంటారు.
ప్ర‌స‌వ వేద‌న స‌మ‌యంలో బిడ్డ పుడ‌తాడు అనే ప్రేమ‌తో ఆ నొప్పిని భ‌రిస్తుంది.
అయితే ఎక్కడైనా ఒక ప్రసవం లో ఒకరు, లేదా ఇద్దరు బిడ్డలు పుడతారు,
లేదా క‌వ‌ల పిల్ల‌లు పుడ‌తారు, ఇటీవ‌ల న‌లుగురు ఐదుగురు కూడా పుట్టిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి..
తాజాగా ఇరాన్ లో ఒకే కాన్పులో ఏడుగురు కూడా జ‌న్మించారు
అయితే ఇప్పుడు సైన్స్ కే అంతుచిక్క‌ని ఓ మిరాకిల్ జ‌రిగింది..
ప్రెగ్మెంట్ అయిన మ‌హిళ నెల‌లు నిండిన త‌ర్వాత ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది, ఇది కామ‌న్ కాని
డెలివ‌రీ అయిన త‌ర్వాత నెల‌లో మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టారు.
అయితే అస‌లు ఇలా ఎలా జ‌రుగుతుంది? ఆమె ఎవ‌రు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెల త‌ర్వాత మ‌రో నెల‌కి ఇద్ద‌రు పిల్ల‌లు పుట్ట‌డం నిజంగా మిరాకిల్
ఇలాంటి అరుదైన ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది, … బంగ్లాదేశ్ కి చెందిన ఆరీఫా సుల్తానా అనే 20 సంవ‌త్స‌రాల మ‌హిళ‌, గత నెల ఫిబ్రవరి 5వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీలో ఓ మగ బిడ్డ జన్మనిచ్చింది సుల్తానా. బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగానే ఉండటం తో ఆమె బిడ్డ ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది, కాని డెలివరీ అయిన 26 రోజులకే ఆమెకు మళ్ళీ నొప్పులు మొదలవడం తో హాస్పిటల్ కి తరలించారు.

Image result for baby birth

ఆమె కడుపులో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు, మొదటి డెలివరీ నార్మల్ డెలివరీ కాగా, ఈ సారి ఆమెకి సీజేరియన్ చేసారు …. ఇద్దరు బిడ్డలను బ‌య‌ట‌కు తీసాక చికిత్స అందించారు, తల్లి అలాగే ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. మొదటి డెలివరీ లో బాబు పుట్టగా, రెండో డెలివరీ లో ఒక బాబు ఒక పాప పుట్టారు.

మొదటి డెలివరీ సమయం లో ఆమె గర్భం లో ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు డాక్టర్ లు గుర్తించలేకపోయారు, ఆమె కూడా తెలుసుకోలేకపోయింది, మొదటి డెలివరీ అయిన 26 రోజుల తరువాత ఆమెకు నొప్పులు రావడం తో ఆమెకు అర్ధమయ్యింది. తన 30ఏళ్ల సర్వీసులో ఇలాంటి అరుదైన కేసు ఇప్పటి వరకు చూడలేదని గైనకాలజిస్ట్‌ పొద్దార్‌ తెలిపారు. ముగ్గురు పిల్లలు తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

ఆరిఫా భర్త సుమోన్‌ బిస్వాస్‌ కూలీ పని చేస్తాడు, నెలకు RS.6 వేలు సంపాదిస్తాడు….మాకు ఈ ముగ్గురు పిల్లలు దేవుడు ప్రసాదించిన వరం అని చెబుతున్నాడు, కష్టపడి ఈ ముగ్గురిని మంచిగా చూసుకుంటా, బాగా పెంచుతా అని ఆరిఫా సుల్తాన్ భర్త సుమోన్‌ బిస్వాస్‌ తెలిపారు. నిజంగా ఇది మిరాకిల్ ఈ విష‌యం గురించి అక్క‌డ డాక్ట‌ర్ మీడియాల‌కు తెలిపారు .మెడిక‌ల్ మిరాకిల్ గా దీనిని రిఫ‌రెల్ కు ఆమె మెడిక‌ల్ డిపార్ట్ మెంట్ కు ప్రాజెక్ట్ గా పంపారు, విన‌డానికే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా .. నిజంగా జ‌న్మ‌నిచ్చిన ఆ త‌ల్లి- పురుడు పోసిన ఆ డాక్ట‌ర్ ఇంకెంత ఆశ్చ‌ర్య‌పోయి ఉంటారో. వారికి మంచి భ‌విష్య‌త్తు ఉండాలి అని కోరుకుందాం.

Content above bottom navigation