పంచ పాండవులతో ద్రౌపది శృంగార రహస్యం

217

బహు భార్యాత్వము లేదా ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం గురించి ఆలోచిస్తే ఈ రోజుల్లో అది ఒక వింతగా అనిపించవచ్చు. కానీ ఈ పద్దతిని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ద్వాపర యుగంలో అనుసరించారు. మహాభారత ప్రకారం ద్రౌపది అనుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో ఐదుగురి పాండవులను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. మహాభారత కథ విన్న చాలా మంది ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇప్పటికీ వెతుకుతుంటారు. ఆమెకు ఐదుగురి అన్నదమ్ములతో వివాహం అయ్యింది? వారందరితో ఎలా సంబంధ బాంధవ్యాలను కొనసాగించింది ? ఇలా ఎన్నో ప్రశ్నలు చాలా మంది మదిని తొలుస్తుంటాయి. ఆ విషయాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహా భారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రదారుల్లో ద్రౌపది కూడా ఒకరు. పురాణ కథల ప్రకారం ద్రౌపది పాంచాల రాజు అయినా దృపద రాజు కూతురు. ఈమె యజ్ఞ కుండలం లో నుంచి జన్మించందని చాలా మంది నమ్ముతారు. ద్రౌపది పెళ్లి చేసే విషయమై స్వయంవరాన్ని ఏర్పాటుచేస్తే, అందులో ఐదుగురు పాండవులు పాల్గొంటారు. స్వయంవరంలో నియమనిబంధనల ప్రకారం పైన తిరుగుతున్న చేప ను ఎవరైతే క్రింద నీటిలో దాని ప్రతిబింబాన్ని చూసి ఆ చేప కన్నుని గురి చూసి కొడతారో వారికి ద్రౌపదిని ఇచ్చి పెళ్ళిచేయడం జరుగుతుంది. అర్జునుడు గొప్ప విలుకాడు కావడంతో, స్వయంవరంలో గెలిచి ద్రౌపది ని పెళ్లి చేసుకుంటాడు. అర్జునుడు తన అన్నదమ్ములతో కలిసి ద్రౌపదిని తన తల్లి కుంతి దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ సమయంలో కుంతి దేవి ఎదో పనిలో నిమగ్నమై ఉండటంతో, ఆమెకు తెలియకుండానే మీరు ఏమైతే తీసుకొచ్చారో దానిని ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెబుతుంది.

కుంతి చెప్పిన ఆ మాట విని అక్కడున్న చాలామంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ విషయాన్ని ఆమె కూడా గుర్తించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఐదుగురు అన్నదమ్ములు ఎంతో విధేయులు కావడంతో ఆమె ఆజ్ఞను పాటించారు, ద్రౌపదిని భార్యగా స్వీకరించారు. ద్రౌపది మొదటి రాత్రి యుధిష్ఠిరుడుతో గడిపిందని ఆ తర్వాత భీముడు, అర్జునుడు, మరియు నకుల సహదేవులతో గడిపిందని చాలా మంది నమ్ముతారు.అయితే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆమె కన్యగానే వెళ్ళింది. అయితే ఇక్కడే అందరికి ఒక సందేహం వస్తుంది. ద్రౌపది ఐదు మందితో ఎలా గడిపింది.అది కూడా ఐదు మందితో కన్యగానే ఉంది.అయితే ఇది ఎలా సాధ్యమయ్యిందంటే దానికి ఒక కారణం ఉంది. అదే మహాశివుని వరం.

Image result for ద్రౌపది

నీకు ప్రతిరోజు ప్రారంభం సమయంలో నీకు కన్యత్వం సిద్ధిస్తుందని వయసుతో సంబంధం లేకుండా నీకు కన్యత్వం లభిస్తుందని వరాన్ని ఇచ్చాడు శివుడు. అందుకే పాండవులు ఐదు మందికి ద్రౌపది కన్యగానే లభించింది. అయితే సంతానం పొందే విషయంలో శ్రీకిష్ణుడు ఆమెకు ఒక సూచనా చేశాడు. అయితే ఒక భర్తతో గడిపే సమయంలో మరొక భర్త అక్కడికి రాకూడదని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఉపదేశిస్తాడు. అయితే ఒకసారి సత్యభామ … ఎలా నువ్వు అన్నదమ్ములందరిని ఆనందంగా ఉంచగలుగుతున్నావు అని ద్రౌపది ని అడుగుతుంది. ” నేను వారికి ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో సేవ చేస్తాను. నా కోపాన్ని, అహాన్ని మరియు కామాన్ని అన్నింటిని ఆ సమయంలో దూరంగా పెడతాను. వారికంటే ముందు ఎప్పుడు కనీసం స్నానం కూడా చేయను ” అని ద్రౌపది చెప్పుకొచ్చింది. ఇందు కారణంగానే ద్రౌపదికి ఐదుగురి పురుషులతో వివాహం జరిగినా, ఆమెను ఒక ఆదర్శవంతమైన మహిళగా గుర్తించారు, ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా అభివర్ణించారు.

Content above bottom navigation