పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య

91

తెలంగాణలో గత ఏడాది జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఘటన తర్వాత యావత్తు భారతావని హర్షించింది. దేశంలో ఇంకొక ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయం పుట్టించేలా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఆ తరువాత ఎన్ కౌంటర్ కేసు కోర్ట్ కు వెళ్లడం, ఆ తర్వాత నిందితుల అంత్యక్రియలకు బ్రేక్ రావడం, తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తర్వాత అంత్యక్రియలు జరగడం అన్ని చకచకా జరిగిపోయాయి.

ఆ నలుగురు మృగాల వల్ల దిశ ఫ్యామిలీ మాత్రమే కాదు.. నేరస్థుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. కన్న కుమార్తెని కోల్పోయి దిశ కుటుంబం తల్లడిల్లుతోంది. నలుగురు దోషుల కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నకేశవులు ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణం. చెన్నకేశవులు భార్య తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. బాబాయి, నాయనమ్మ సంరక్షణలో పెరిగింది. 13 ఏళ్లకే చెన్నకేశవులను పెళ్లి చేసుకుంది. చెన్నకేశవులను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అత్తగారింటికి వచ్చింది. ఆమెకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె బాబాయి ఇంట్లో ఉంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగినప్పుడు చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతి. నిండు గర్భిణీ భర్త కోసం కన్నీళ్లు పెట్టుకుని పస్తులు ఉంది.

తనను కూడా చనిపోవాలని అనుకుంది. కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం బతకాలనుకుంది. చెన్నకేశవులు కుటుంబం కూడా కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడు బయటకొస్తాడా అని ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. రేణుక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక కొన్నిరోజుల క్రితం తనకు ఆడపిల్ల పుడితే దిశా అని పేరు పెడతా అని మీడియాకు చెప్పింది. ఆమె అనుకున్నట్టే ఇప్పుడు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చూడాలి మరి దిశా అని పేరు పెట్టి తన మాటను నెరవేర్చుకుంటుందో లేదో..

Content above bottom navigation