పన్ను కట్టకుంటే, తొలిరోజు రాత్రి వారితో గడపాలి…

125

ఇప్పుడంటే రాజ్యాలు లేవు.. రాజులు లేరు… కానీ ఒకప్పుడు అంతా రాజుల కాలమే. రాజులు పాలించే కాలంలో పేద ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవారు. అయితే ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య పన్నులు కట్టడం. ఒకవేళ పన్నులు కట్టకపోతే దారుణమైన శిక్షలు వేసేవారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వానికి తప్పనిసరిగా పన్నులు కట్టాలి. అయితే ఆ కాలంలో ఉన్న దరిద్రమైన శిక్షలలో ఒకటి సామంత రాజులతో గడపడం. పన్ను కట్టకపోతే వారి భార్యలు రాజుల దగ్గరకు వెళ్ళాలి. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

అది1280 సంవత్సరం. స్కాట్లండ్‌‌ను పాలిస్తున్న మూడో అలెగ్జాండరు చనిపోయాడు. అతడికి వారసులు ఎవరూ లేకపోవడంతో ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్‌ దీన్ని అవకాశంగా మలుచుకున్నాడు. తన సైన్యంతో స్కాట్లండ్‌ పై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా స్కాట్లాండ్ సామంత రాజులకు రాయబారం పంపాడు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించాడు. దీంతో అక్కడికి వెళ్లిన సామంత రాజులను ఎడ్వర్డ్ మోసం చేశాడు. వాళ్లను బంధీలుగా చేసుకుని ఉరి తీయించాడు. ఆ సమయంలో మరో యోధుడు వాలెస్ కూడా అక్కడే ఉన్నాడు. తన తండ్రి, అన్నలతో కలిసి ఆ దారుణాన్ని చూసిన వాలెస్ చలించిపోయాడు. ఎడ్వర్డ్‌ కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఘటన తర్వాత స్కాట్‌ యోధులంతా సమావేశమై ఇంగ్లాండ్ పై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు వాలెస్‌ తండ్రి, అన్న కూడా సిద్ధమయ్యారు. అయితే, వాలెస్‌‌ను తమతో తీసుకెళ్లకుండా పొలం పనులు అప్పగించారు. కొద్ది రోజుల తర్వాత వాలెస్ తండ్రి, అన్న యుద్ధంలో చనిపోయారనే వార్త విని ఆవేదనకు గురయ్యాడు.

తండ్రి అంత్యక్రియల తర్వాత వాలెస్ తన పిన తండ్రి ఆర్గిల్ సాయంతో కత్తిసాము, విలువిద్య, ఇతర విద్యలు నేర్చుకున్నాడు. పదేళ్ల తర్వాత తన రాజ్యానికి తిరిగివచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లిలో ఓ వింత ఆచారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వధువు తన తొలిరాత్రిని వరుడితో కాకుండా సామంత రాజులతో గడిపే విధానం చూసి ఆవేదనకు గురయ్యాడు. స్కాట్లాండ్‌ లో బ్రిటీష్ సంతతిని పెంపొందించుకొనేందుకు ఎడ్వర్డ్ పన్నిన కుట్ర అని తెలుసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. ఎడ్వర్డ్ సామంత రాజులకు, జమిందారులకు అనేక హక్కులు కల్పించాడు. ప్రజలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే తొలిరాత్రి నవ వధువును అనుభవించే హక్కు కూడా ఇచ్చాడు. దీంతో అక్కడి రాజులు వివాహ పన్నులను అందుబాటులోకి తెచ్చారు. అవి చెల్లించకపోతే నవ వధువును రాజు లేదా జమిందారులతో తొలి రాత్రి గడిపి లైంగిక ఆనందం కల్పించేందుకు అంగీకరించాలనే నిబంధన పెట్టారు.

Image result for పన్ను కట్టకుంటే, తొలిరోజు రాత్రి వారితో గడపాలి…

ఈ నిబంధన వాలెస్ పెళ్లిపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. వాలెస్ తన బాల్య స్నేహితురాలు మురాన్‌ ను ప్రేమించాడు. ఆమెను పెళ్లాడితే జమిందార్ల వద్దకు పంపాలనే ఆందోళన అతడిని వెంటాడేది. దీంతో ఓ రోజు వాలెస్ ఆమెను రహస్యంగా పెళ్లాడాడు. ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా ఆమెతో సంసారం చేసేవాడు. ఎడ్వర్డ్‌ ను ఎదిరించలేక రైతుగా జీవితాన్ని గడిపేవాడు. అయితే, మురాన్‌‌ పై కొందరు బ్రిటీష్ సైనికులు అత్యాచారయత్నం చేయబోయారు. దీంతో వాలెస్ వారితో పోరాడి మురాన్‌ ను రక్షించుకున్నాడు. సైనికులకు వారిపై అనుమానం కలిగి ఈ విషయాన్ని గ్రామాధికారికి తెలిపారు. తమ రహస్య వివాహం గురించి బయటకు తెలిస్తే శిక్ష తప్పదని భావించిన వాలెస్, మురాన్‌ తో కలిసి పారిపోడానికి ప్రయత్నించాడు. అయితే, సైనికులు అప్పటికే అతడిపై నిఘా ఉంచారు. ఆ జంటను బంధించారు. సైనికులపై దాడి చేసినందుకు, వివాహ పన్నును ఎగవేసి రహస్యంగా ఆమెను పెళ్లాడినందుకు శిక్షగా మురాన్ గొంతు కోసి చంపేశారు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన భార్యను హత్య చేశారనే కోపంతో వాలెస్ రెబల్‌ గా మారాడు. ప్రజలతో కలిసి బ్రిటీష్ సైనికులపై దాడి చేశాడు. తన భార్యను హత్య చేయించిన గ్రామాధికారిని కూడా అదే విధంగా చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ విజయం స్థానికుల్లో ఉత్సాహం నింపింది. ఊహించని విధంగా వాలెస్‌‌ను నాయకుడిగా మార్చింది.

Content above bottom navigation