పాములకు హాని కలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? నివారణ మార్గాలు..

281

పూర్వజన్మలో గానీ, ఈ జన్మలో గానీ పాములను చంపినవారు లేదా, పాములను బందించినవారు, పుట్టలను త్రవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై ఇల్లులు కట్టినవాళ్లకు జాతకంలో సర్పదోషం ఉంటుంది. ఈ దోషం ఉన్నవాళ్లకు పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం, కుటుంబంలో కలతలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రభావం చూపి భాదపెడుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 అశుభ స్ధానాలలో ఉంటే నాగదోషం ఉన్నట్టే.

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉంటె, సంతానం ఆలస్యం అవ్వడం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం లాంటివి జరుగుతాయి.. ఇక జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉంటే, అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడటం, పాము కలలోకి రావటం జరుగుతుంది. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన పిల్లలు జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి. దీని నివారణకు ఏం చెయ్యాలంటే, రోజు పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. నాగదోష నివారణకు శుభ తిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము అంటే ఇష్టం. పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము రోజున ఎట్టిపరిస్థితిలో నాగపూజ చెయ్యకూడదు. నాగ శాంతి పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో చేస్తే, వారికి అరిష్టం తొలగిపోయి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది.

  • నాగ దోషం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి, మరుసటి రోజు శివదర్శనం చేసుకొని, రాహుకేతువుల పూజా చేస్తే మంచిది..
  • ఆరు ముఖాలు, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరిస్తే మంచి జరుగుతుంది.
  • ప్రతీ శుక్లపక్ష పాడ్యమి, అమావాస్య తిధులల్లో శనివారం రోజు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా నివారణ కలుగును.
  • నాగ ప్రతిమ స్వామిని 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయడం వలన మంచి జరుగును.
  • ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకం చేసి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయడం వలన దోషం పోతుంది. రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టడం వలన కూడా నివారణ జరుగును.
  • నవగ్రహలకు 21 రోజులు ప్రదక్షిణలు చేస్తే దోషం పోతుంది. ప్రతీ ఆదివారం ఉపవాసం ఉండి, నాగదేవత ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తూ, లలితా సహస్రనామావళి గానీ, దుర్గా సప్తసతిని గానీ పఠిస్తే దోషం పోతుంది.
  • దోషం ఎక్కువ ఉన్నవాళ్లు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోషం పోతుంది. అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం పోతుంది..
  • రాహు కేతువులకు మూలమంత్ర జపములు, తర్పణంలు దానము చేయడం వల్ల కూడా దోష పోతుంది. మినుములు, నువ్వులు. ఉలువలు ప్రతీ మంగళవారం దానము చెయ్యాలి.

ఇలా కొన్ని పరిహారాలు చేస్తే దోషం పోయే అవకాశం ఉండి. పూర్వజన్మలో చేసిన పొరపాట్ల వలన ఆ దోషం ఈ జన్మలో కూడా వెంటాడుతూ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాతకాన్ని చూపించుకొని జాతకంలో నాగదోషం ఉంటే ఈ పరిహారాలు పాటించి దోషాన్ని నివృత్తి చేసుకోండి.

Content above bottom navigation